
ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ బోల్డ్ రొమాంటిక్ ఆంథాలజీ సిరీస్ వచ్చేసింది. సక్సెస్ ఫుల్గా రెండు సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ‘ష్’ (Sshhh) సిరీస్.. మరో కొత్త సీజన్తో డిజిటల్ తెరపై అడుగుపెట్టింది. ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్కు కొత్త బ్యూటీలతో కిక్కిచ్చే సీన్స్తో మేకర్స్ సీజన్ 3 తీసుకొచ్చారు.
ఈ సీజన్‌లో బిగ్ బాస్ ఫేమ్ దివి, పూనమ్ బజ్వా, కిరణ్ రాథోడ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇప్పటికే సోషల్ మీడియాలో గ్లామర్ ఫొటోలు, వీడియోలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరి ఎంట్రీతో సీజన్ 3పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ్టి నుంచే ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ సిరీస్ తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉంది. అయితే ఇందులో బోల్డ్, రొమాంటిక్ అంశాలు ఎక్కువగా ఉండటంతో ఇది పెద్దల కోసం (Adults Only) రూపొందించబడింది.
Welcoming Vaishali to the world of #SshhhSeason3, the aha way! ✨#Sshhhseason3 Premieres June 12th on #aha#Sshhhseason3onaha #Divi pic.twitter.com/W7VuwV69ih
— aha Tamil (@ahatamil) June 9, 2026
స్టోరీ బ్యాక్‌డ్రాప్..
సోషల్ మీడియా ద్వారా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో కంటెంట్ క్రియేటర్లుగా మారుతున్న కొందరి జీవితాలు, సబ్‌స్క్రిప్షన్ కల్చర్, దాని వల్ల ఎదురయ్యే విమర్శలు, సమాజంలో చోటుచేసుకుంటున్న కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఈ సిరీస్ సాగుతుంది. కేవలం బోల్డ్ సన్నివేశాలకే పరిమితం కాకుండా, ప్రస్తుత యువత ఆలోచనలను ప్రతిబింబించేలా కథను రూపొందించారు. కామెడీ, రొమాన్స్ తో పాటు ఒక మెసేజ్ కూడా అందించే ప్రయత్నం చేశారు.
గత రెండు సీజన్ల టాక్..
‘ష్’ ఫస్ట్ సీజన్‌లో మొత్తం నాలుగు ఎపిసోడ్లు ఉన్నాయి. ‘సెక్స్ ఎడ్యుకేషన్’, ‘ఒక్కడు’, ‘మళ్లీ కలుద్దాం’, ‘రీలోడ్’ పేర్లతో వచ్చిన ఈ ఎపిసోడ్లు ఆడియన్స్ని ఆకట్టుకున్నాయి. ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కో కథను చూపించారు. ఇందులో శ్రీరామ్, సోనియా అగర్వాల్, ఇనయా, ఐశ్వర్య దత్తా, క్రిష్ కురుప్, మైమ్ గోపీ తదితరులు నటించారు.
Every character has a story. Meet the cast of #SshhhSeason3 🎭
Stay tuned @ahatamil 🌟#ahatamil #SshhhSeason3 pic.twitter.com/IuurnJ8KUf
— aha Tamil (@ahatamil) June 4, 2026
సీజన్ 1తో పోలిస్తే మరింత బోల్డ్‌గా రూపొందిన సీజన్ 2లో వెట్రి, ప్రేమ్ జీ, వేదిక, జినాల్ జోషి, ఐశ్వర్య దత్తా, ఆరోరా, మానుషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘గిగోలో’, ‘దబిడి దిబిడి’, ‘లీక్డ్ వీడియో’, ‘తొలి స్వప్నం’పేర్లతో నాలుగు ఎపిసోడ్లు ప్రేక్షకులను అలరించాయి. ఇవి తెలుగులోనూ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు మూడో సీజన్‌తో ‘ష్’ మరోసారి బోల్డ్ కంటెంట్‌తో పాటు సమకాలీన అంశాలను ప్రస్తావిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సీజన్ కూడా గత రెండు సీజన్ల మాదిరిగా హిట్ అవుతుందో లేదో చూడాలి