
టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ని డైరెక్టర్ అనిల్ రావిపూడి సముద్రపు ఒడ్డున ఇసుకలో పాతిపెట్టేశాడు. జివితో పాటుగా టాలెంటెడ్ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ని కూడా అనిల్ పాతిపెట్టేశాడు. వీరిద్దరిని చెరో పక్క పాతిపెట్టేసి వాళ్ళతో చెడుగుడు ఆడేసుకున్నాడు. అసలు మట్టిలో పాతిపెట్టడం ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అదే అనిల్ రావిపూడి మార్క్ ప్రమోషన్ మ్యాజిక్!
వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మూవీ ప్రమోషన్స్ కోసం క్రేజీ ఐడియాతో ప్రేక్షకులను అలెర్ట్ చేశాడు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా జివి, లిరిసిస్ట్గా అనంత్ శ్రీరామ్ లను పరిచయం చేయడం కోసం మట్టిలో పాతేసాడు. ఈ సందర్భంగా వారితో మాట్లాడిన మాటలతోనే పాటలపై హైప్ పెంచేశాడు. మాస్ పాట, క్లాస్ పాట, డీజే పాట..ఎమోషనల్ పాట అంటూ సినిమాలో ఉండే పాటల గురించి అనిల్ చెప్పిన మాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి.
Classu Paata… Massu Paata…
Emotional Paata… Melody Paata… BGM Paata… 🎶🔥Chartbuster paatalu kosam,
Mana Blockbuster Music Director ni lock chesam 😎🎵Welcoming National Award-winning @gvprakash garu on board for #VenkyAnil5 – #NKRAR2 ❤️🔥
— https://t.co/Zqd5uLeRur… pic.twitter.com/ynvnuEYm7T
— Shine Screens (@Shine_Screens) June 12, 2026
ఎలా అండి ఇలా:
నిజానికి అనిల్ రావిపూడి సినిమాలు అంటేనే.. ప్రమోషన్స్తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడం. అనిల్ తన స్టైల్ ఫన్ని జోడిస్తూ ఆడియన్స్కి నచ్చేలా, వైరల్ అయ్యేలా ప్రమోషన్స్ చేస్తుంటాడు. ఈ ఫార్ములా సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బాగా వర్కౌట్ అయింది. ఇటీవలే అదే పంథాని మన శంకర వరప్రసాద్ కోసం కూడా వాడి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇందులో భాగంగా లేటెస్ట్గా ఈ క్రేజీ వీడియో వదిలాడు అనిల్ రావిపూడి. మ్యూజిక్ డైరెక్టర్ జీవితో కలిసి దర్శకుడు అనిల్ ప్రమోషన్స్‌ను అఫీషియల్‌గా ప్రారంభించాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Excited to collaborate for the third time with dear brother @sahugarapati7 and @Shine_Screens for #VenkyAnil5 #NKRAR2 🤗🤗
Glad to have @ZeeStudios_ join this journey and the legendary @SureshProdns present it 😍👌🏻
SANKRANTHI 2027 RELEASE ✨
Victory @VenkyMama @NANDAMURIKALYAN… pic.twitter.com/zVryHSdasE
— Anil Ravipudi (@AnilRavipudi) March 27, 2026
హ్యాట్రిక్ దిశగా అనిల్ రావిపూడి..
2025లో విక్టరీ వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ హిట్ కొట్టిన అనిల్, 2026లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాశారు. ఇప్పుడు ఇదే ఊపులో తన తదుపరి చిత్రాన్ని కూడా సంక్రాంతికే సిద్ధం చేస్తున్నారు. వరుసగా మూడవ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచి, హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని అనిల్ పక్కా ప్లాన్‌తో ఉన్నారు.
►ALSO READ | Rukmini Vasanth: ‘డ్రాగన్’ బ్యూటీకి టాలీవుడ్లో మరో ఛాన్స్.. నాని ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా రుక్మిణి?
ఇందులో విక్టరీ వెంకటేష్‌తో పాటు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ కలిసి నటించబోతున్నారు. ఇప్పటికే ఎఫ్2, ఎఫ్3 చిత్రాలతో వెంకీతో మంచి కెమిస్ట్రీ కుదిరిన అనిల్, ఇప్పుడు కళ్యాణ్ రామ్ మార్క్ యాక్షన్‌ను కూడా దీనికి జోడించబోతున్నారు. ఈ ఇద్దరు హీరోలు స్క్రీన్ పంచుకోబోతున్నారనే వార్త సినీ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
కీర్తి సురేష్ ఎంట్రీ?
ఈ సినిమాలో హీరోయిన్ల విషయంలో కూడా ఆసక్తికరమైన అప్‌డేట్స్ వినిపిస్తున్నాయి. వెంకటేష్ సరసన మహానటి కీర్తి సురేష్ నటించే అవకాశాలు ఉందని సమాచారం. అనిల్ రావిపూడి చెప్పిన లైన్ నచ్చడంతో ఆమె ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ సరసన మరో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతోంది. ఇప్పటికే కొంతమంది క్రేజీ హీరోయిన్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
మొదటి “వందకోట్ల బొమ్మ” కొట్టిన హీరో.. Victory @VenkyMama గారితో🔥
“మొదటిసారి బొమ్మ” తీసే అవకాశం ఇచ్చిన హీరో @NANDAMURIKALYAN గారితో కలిసి 💥
2027 మొదటి పండగకి మీ, ముందుకు వస్తున్నాం 😍😍😍#VenkyAnil5 #NKRxAR pic.twitter.com/WRVWdbQpbz
— Anil Ravipudi (@AnilRavipudi) February 26, 2026