Reading Time: 2 minutes

Rao Bahadur Teaser: ‘బాహుబలి’, ‘RRR’ రేంజ్‌లో ‘రావు బహదూర్‌’… టీజర్‌తో మైండ్ బ్లాక్ చేసిన సత్యదేవ్-!

Caption of Image.

టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్, క్లాసిక్ డైరెక్టర్ వెంకటేష్ మహా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘రావు బహదూర్‌’ (Rao Bahadur). ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా.. ఈ ఏడాది జులై 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది.

ఈ క్రేజీ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు.  రాజసం ఉట్టిపడే క్యారెక్టర్లు, రిచ్ విజువల్స్, మైండ్ బ్లోయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో వెంకటేష్ మహా ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతున్నట్లు టీజర్ చూస్తేనే అర్థమవుతోంది.

 

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ.. ఏ భాషలో మంచి సినిమా వచ్చినా మన తెలుగు ఆడియన్స్ గుండెల్లో పెట్టుకుంటారు అని అన్నారు.. కానీ, జులై 3న ‘రావు బహదూర్‌’ రిలీజ్ అయ్యాక.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈ చిత్రం గురించి మాట్లాడుకుంటుంది. విదేశీయులు ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాలను ఎలాగైతే ఓన్ చేసుకున్నారో.. ఈ సినిమాని కూడా అలాగే అప్రిషియేట్ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ కథ కోసం ఇన్నేళ్లు తపస్సు చేశారు. ఇందులో 1950-60 కాలం నాటి ఒరిజినల్ కాస్ట్యూమ్స్‌ను ముంబై వేలంలో కొనుగోలు చేసి మరి వాడాం. ఇదొక విజువల్ వండర్ అంటూ హైప్ పెంచేశారు.

►ALSO READ | పూరి జగన్నాథ్ వింటేజ్ మాస్ ఈజ్ బ్యాక్.. విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్’ టీజర్ మేకింగ్ వీడియో రిలీజ్!

ఈ చిత్రానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో వికాస్ ముప్పాల, దీపా థామస్, బాల పరాశర్, ఆనంద్ భారతి కీలక పాత్రలు పోషిస్తున్నారు. గతంలో ‘మేజర్’ సినిమాను మహేష్ బాబుకు ముందే చూపించి సపోర్ట్ తీసుకున్నట్లుగానే.. ఈ ‘రావు బహదూర్‌’ అవుట్‌పుట్ కూడా త్వరలోనే ఆయనకు స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్లు ప్రొడ్యూసర్ అనురాగ్ తెలిపారు. మొత్తానికి ఈ జులై 3న బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడానికి ‘రావు బహదూర్‌’ సిద్ధమయ్యాడు.

 

©️ VIL Media Pvt Ltd.