శివుడికి అత్యంత ప్రీతికరమైనది రుద్రాక్ష. శివ పురాణంలో రుద్రాక్షకు ప్రాముఖ్యత గురించి ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది. అంతే కాకుండా శివుడి వరంగా భావించే ఈ రుద్రాక్షను మెడలో ధరించడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుందని భావిస్తారు. చాలా మంది సాదువులు, యోగులు దీనిని ధరిస్తుంటారు.
అయితే చాలా మంది మదిలో ఉండే అతి పెద్ద ప్రశ్న రుద్రాక్షను స్త్రీలు ధరించవచ్చునా? దీని గురించి సమాజంలో అనేక అపోహాలు ఉన్నాయి. కొందరు దీనిని ధరిస్తే, మరికొంత మంది మాత్రం ధరించడానికి భయపడుతున్నారు. కాగా, అసలు దీని గురించి శాస్త్రాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం.
శివ పురాణం ప్రకారం, తపస్సు చేసి మేల్కున్న శివుడి ఆనంద భాష్పాలు, కన్నీటి నుంచి ఉద్భవించినవి ఈ రుద్రాక్ష చెట్లు అని చెబుతుంటారు. ఇక ఇవి ఎక్కువగా హిమాలయాల్లోని అరుణ్ లోయ వంటి పర్వత ప్రాంతాలలో చాలా ఎక్కువగా కనిపిస్తుటాయి. అక్కడ సులభంగా పెరుగుతాయి. ఎవరు అయితే వీటిని ధరిస్తారో, వారిలో సానుకూలత పెరుగుతుందంట. అంతే కాకుండా చెడు శక్తి దరిచేరకుండా కాపాడుతుందంట.
అయితే స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చా? అంటే వీరు ధరించకూడదు అని ఏ గ్రంథాల ప్రస్తావించలేదు. అందువలన స్త్రీ, పురుషులు ఇద్దరూ దీనిని సమానంగా ధరించవచ్చునంట. దేవి భాగవతంలో పార్వతి దేవి స్వయంగా రుద్రాక్ష మాల ధరించనట్లు ఉంది. అందువలన దీనిని స్త్రీలు ధరించడం విషయంలో ఎలాంటి అపోహలు లేవు అని చెబుతున్నారు పండితులు.
కానీ స్త్రీలు ధరించే సమయంలో కొన్ని నియమాలు పాటించాలంట. ముఖ్యంగా బహిష్ట సమయంలో మూడు నుంచి ఐదు రోజుల పాటి తీసి వేయాలంట. అలాగే ప్రసవం తర్వాత దాదాపు 40 రోజుల వరకు దీనిని ధరించకూడదు, అలాగే మాంసాహారం, మద్యం సేవించే సమయంలో తీసి వేయడం కూడా మంచిదని చెబుతున్నారు నిపుణులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.




