Reading Time: < 1 minute

బంజారాహిల్స్ నిలోఫర్ కు షాక్.. ఫైర్ NOC సస్పెండ్ చేసిన డీజీ

Caption of Image.

హైదరాబాద్‌లోని ప్రముఖ ఫుడ్ జాయింట్ నిలోఫర్ కేఫ్ కు అగ్నిమాపక శాఖ  షాక్ ఇచ్చింది. బంజారాహిల్స్‌లోని నిలోఫర్ బిల్డింగ్ ఫైర్ ఎన్‌ఓసీ (Fire NOC)ని తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ తక్షణమే సస్పెండ్ చేస్తూ  ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై వచ్చిన ఫిర్యాదులతో ఫైర్ అధికారులు రంగంలోకి దిగారు.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న నిలోఫర్ బిల్డింగ్‌ను ఫైర్ సర్వీస్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి చట్టపరమైన అనుమతులు, కనీస భద్రతా ప్రమాణాలు లేకుండానే నిలోఫర్ బిల్డింగ్ పైన (Rooftop) ఒక రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నట్లు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా గుర్తించారు.

►ALSO READ | ఈగల్ ఫోర్స్ మెరుపు దాడి..రూ. కోటి డ్రగ్స్,కెమికల్స్ సీజ్..మామిడి తోటలో సీక్రెట్ ఫ్యాక్టరీ సీజ్

భవన నిర్మాణ నిబంధనలకు, అగ్నిమాపక భద్రతా సూత్రాలకు పూర్తిగా విరుద్ధంగా ఈ వ్యాపారం నడుస్తున్నట్లు నిర్ధారించుకున్న ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్.. సదరు బిల్డింగ్‌కు ఇచ్చిన ఫైర్ ఎన్‌ఓసీని రద్దు చేశారు. ప్రజా రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. 

©️ VIL Media Pvt Ltd.