Reading Time: < 1 minute

Good Health : చూడటానికి చిన్నవి.. ఇవి చేసే మేలు అంతా ఇంతా కాదు.. రోజుకు నాలుగు తింటే షుగర్ వ్యాధి కంట్రోల్

Caption of Image.

డయాబెటిస్ ఉన్నవాళ్లు షుగర్ లెవల్స్ తగ్గించుకోవడం చాలాముఖ్యం. షుగర్ తగ్గడానికి ఎప్పుడూ మందులపైనే ఆధారపడకుండా, డైట్​ తో  కూడా తగ్గించుకోవచ్చు. అందుకు చాలా రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. అందులో గుమ్మడి గింజలు ఒకటి. వీటిలోని మినరల్స్, ఫైబర్, విటమిన్ కె, ఎ, ఇలు రోగాలబారిన పడకుండా కాపాడతాయి.

  • గుమ్మడి గింజలు తింటే. శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఎముకల్ని గట్టి పరుస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను తగ్గిస్తాయి.
  • డయాబెటిస్ ఉన్నవాళ్లు గుమ్మడి గింజలను శ్నాక్ లా తినొచ్చు. ఇవి ఇన్సులిన్ ను బ్యాలెన్స్ చేస్తాయి. ఆక్సిడేషన్ వల్ల వచ్చే హైపర్ టెన్షన్​ ను  కూడా తగ్గిస్తాయి. గుమ్మడి గింజల్ని వేగించి తినొచ్చు లేదా సలాడ్ కూడా వాడుకోవచ్చు.
  • వీటిలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె సంబంధ వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చు. ఆకలి అదుపులో ఉంటుంది. దాంతో బరువు తగ్గొచ్చు.
  • కడుపు, రొమ్ము, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, పేగు క్యాన్సర్ల ముప్పుని కొంతవరకు తగ్గించుకోవచ్చు.
  • ఈ గింజల్లోని మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్​ను తగ్గిస్తుంది. వీటిలో ఉండే ట్రిప్టోఫేన్ నిద్ర పట్టేలా చేస్తుంది. నిద్రపోయే ముందు నాలుగు గుమ్మడి గింజలు నోట్లో వేసుకుని నమిలినా మంచి నిద్ర పడుతుంది.

 

©️ VIL Media Pvt Ltd.