Reading Time: < 1 minute

అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా మోదీ.. తొలి ప్రధాని నెహ్రూ రికార్డు బ్రేక్

Caption of Image.

ఇండియాకు అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బుధవారంతో (2026 జూన్ 10) మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ పేరున ఉన్న 4 వేల 399 రోజుల రికార్డును అధిగమించారు. 

ఈ మైల్ స్టోన్ అందుకున్న సందర్భంగా ప్రధాని ఎక్స్ లో  పాలనలో ప్రజాసేవ, మానవత్వం అంకితభావం ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ ట్వీట్ చేశారు. ఉత్తమ పాలనకు ప్రజాసేవయే పరీక్ష అని, అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యతా భావంతో పనిచేసేవారు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలరని పేర్కొన్నారు.

కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మోదీ ఈ ఘనత సాధించారు. 2014లో తొలిసారిగా అధికారం చేపట్టిన మోదీ, ఆ తర్వాత 2019, 2024లలో కూడా ఎన్నికలలో విజయం సాధించి, నెహ్రూ తర్వాత వరుసగా మూడు లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన తొలి ప్రధానమంత్రి అయ్యారు.

భారత్ లో మొదటి జనరల్ ఎన్నికలు జరగడానికి ముందు, 1947 నుండి 1952 వరకు నెహ్రూ మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత పనిచేసిన కాలాన్ని .. అంటే 1952 నుంచి ఆయన పదవీకాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మొత్తం మీద 14 ఏళ్లకు పైగా పదవిలో ఉన్నప్పటికీ, ఆమె పదవీకాలం నిరంతరాయంగా సాగలేదు. దీంతో మోదీ ఎక్కువ రోజులు.. నిరంతరాయంగా పనిచేసిన ప్రధానిగా నిలిచారు.

©️ VIL Media Pvt Ltd.