Reading Time: < 1 minute

సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ది..దేశ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాం: ప్రధాని మోదీ

Caption of Image.

సుస్థిర ప్రభుత్వంలోనే దేశ అభివృద్ది వేగంగా జరుగుతోందన్నారు ప్రధాని మోదీ. ఎన్డీయే కూటమి పాలనలో ప్రజలు అభివృద్ధి ఫలాలను చూస్తున్నారని అన్నారు. గతంలో దశాబ్దాల పాటు జరిగిన అభివృద్ది నెలల్లో జరుగుతోంది.. మధ్యతరగతి, పేదలు, రైతులు ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్నాం..దేశ యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతర కృషి చేస్తుంటామన్నారు ప్రధాని. మోదీ పాలన 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కూటమి సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు,  అగ్ర నేతలు హాజరయ్యారు.  ఎన్డీయే నేతలను బెంగాల్ బల్మూరి అందజేశారు ప్రధాని మోదీ చేశారు.  

ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా సుదీర్ఘ కాలం అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అధికారం సేవగా భావించానన్నారు ప్రధాని. 2014 కు ముందు దేశంలో అస్థితర నెలకొంది.. ఎంతో నష్టం జరిగింది.. మా హయాంలో స్థిరమైన పాలన, అభివృద్ది వేగంగా సాగుతోందన్నారు. 140 కోట్ల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నామన్నారు. మధ్యతరగతి, పేదలు, రైతులు ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్నామన్నారు ప్రధాని.గతంలో దశాబ్దాల పాటు జరిగిన అభివృద్ది నెలల్లో జరుగుతోందన్నారు. అవినీతి రహితంగా ఎన్డీయే పాలన సాగుతోంది..సుస్థిర పాలనకు సహకరించిన ఎన్డీయే నేతలు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ. 

►ALSO READ | బ్లాక్ మనీ కేసులో..ముంబై హైకోర్టులో అనిల్ అంబానీకి భారీఊరట

©️ VIL Media Pvt Ltd.