Reading Time: < 1 minute

వాహనదారులకు ఆర్టీఏ గుడ్ న్యూస్..ఫ్యాన్సీ నంబర్ల కోసం గడువు పెంపు

Caption of Image.

తెలంగాణలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి రాష్ట్ర రవాణా శాఖ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. తమ వాహనాలకు నచ్చిన ఫ్యాన్సీ లేదా ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్లను రిజర్వ్ చేసుకునే గడువును రవాణా శాఖ  పొడిగించింది. వాహనదారుల సౌకర్యార్థం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

నిజానికి ప్రస్తుతవాహన్ సాఫ్ట్‌వేర్ విధానం ప్రకారం… కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే టెంపరరీ రిజిస్ట్రేషన్ లేదా టీఆర్ (TR) కేవలం 30 రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతుంది. అంటే వాహనదారులు నెల రోజుల్లోపే తమకు కావలసిన స్పెషల్ నంబర్లను ఎంచుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తాజా నిర్ణయం ప్రకారం… టెంపరరీ రిజిస్ట్రేషన్ జారీ చేసిన తేదీ నుంచి ఏకంగా రెండు నెలల పాటు (60 రోజులు) ఫ్యాన్సీ నంబర్లను ఎంచుకునేందుకు రవాణా శాఖ గడువు ఇచ్చింది.

►ALSO READ | గృహిణి కేవలం హోంమేకర్ మాత్రమే కాదు.. నేషన్ బిల్డర్ కూడా: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అయితే ఇదే సమయంలో వాహనదారులకు అధికారులు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. వాహనం కొనే సమయంలో ఫ్యాన్సీ నంబర్ కావాలని ఆప్షన్ పెట్టుకుని… ఈ రెండు నెలల గడువులోగా దానిని రిజర్వ్ చేసుకోకపోతే మాత్రం నష్టపోక తప్పదు. రెండు నెలల సమయం ముగిసిన వెంటనే వాహన్ సాఫ్ట్‌వేర్ ఆటోమేటిక్‌గా ఏదో ఒక సాధారణ నంబర్‌ను మీ వాహనానికి కేటాయిస్తుంది. ఆ తర్వాత నచ్చిన నంబర్ మార్చుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు.

కాబట్టి కొత్త వాహనాలు కొని ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎదురుచూస్తున్న వారు ఈ పెంచిన గడువును ఉపయోగించుకుని, వీలైనంత త్వరగా తమకు నచ్చిన నంబర్‌ను రిజర్వ్ చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది.

 

©️ VIL Media Pvt Ltd.