Reading Time: 2 minutes
Iqoo Flagship Days Sale Iqoo 15 Iqoo 15r And Neo 10 Get Massive Discounts In India

iQOO Flagship Days Sale: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు iQOO (ఐక్యూ) గుడ్ న్యూస్ చెప్పింది. భారత మార్కెట్లో ఫ్లాగ్షిప్ డేస్ సేల్ (iQOO Flagship Days Sale)ను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో iQOO 15, iQOO 15R, iQOO Neo 10 స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సేల్ జూన్ 8 నుంచి జూన్ 11 వరకు కొనసాగనుంది. వినియోగదారులు iQOO అధికారిక ఈ-స్టోర్‌తో పాటు అమెజాన్ ఇండియాలో ఈ ఆఫర్లను పొందవచ్చు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక రాయితీలు కూడా అందుబాటులో ఉంటాయి.

iQOO 15:

ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో ఉన్న iQOO 15 స్మార్ట్‌ఫోన్‌పై మొత్తం రూ.6,000 వరకు తగ్గింపు లభిస్తోంది. ఇందులో రూ.4,000 కూపన్ డిస్కౌంట్‌తో పాటు రూ.2,000 బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. దీంతో ఫోన్‌ను రూ.72,999 బదులుగా రూ.66,999కే కొనుగోలు చేయవచ్చు. అలాగే 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌లో 2K Samsung M14 LEAD OLED డిస్‌ప్లే, 6000 నిట్స్ లోకల్ పీక్ బ్రైట్‌నెస్, Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్, iQOO Supercomputing Chip Q3 వంటి శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. అదనంగా 7000mAh బ్యాటరీ, 100W ఫ్లాష్‌చార్జ్, 40W వైర్‌లెస్ చార్జింగ్, ట్రిపుల్ 50MP కెమెరా సెటప్‌ను అందించింది. ఈ ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6తో పనిచేస్తుంది. కంపెనీ 5 సంవత్సరాల OS అప్‌డేట్లు, 7 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను హామీ ఇచ్చింది.
Image (14)

iQOO 15R:

పర్ఫార్మెన్స్, గేమింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని వచ్చిన iQOO 15Rపై రూ.4,000 వరకు తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ.2,000 కూపన్ డిస్కౌంట్, రూ.2,000 బ్యాంక్ ఆఫర్ ఉన్నాయి. దీంతో ఫోన్ ధర రూ.46,999 నుంచి రూ.42,999కు తగ్గింది. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8 Gen 5 ప్రాసెసర్, 7600mAh భారీ బ్యాటరీ, 144FPS గేమింగ్‌కు మద్దతు ఇచ్చే iQOO SuperComputing Chip Q2 ఉన్నాయి. 1.5K 144Hz AMOLED EyeCare డిస్‌ప్లే, 50MP Sony LYT-700V OIS కెమెరా, 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 32MP సెల్ఫీ కెమెరా, 4K 60FPS వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. IP68, IP69 రేటింగ్‌తో పాటు Android 16 ఆధారిత OriginOS 6.0 కూడా ఈ ఫోన్ ప్రత్యేకత.

iQOO Neo 10:

మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో ఉన్న iQOO Neo 10పై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ ఫోన్‌ను రూ.37,999 బదులుగా రూ.34,999కు కొనుగోలు చేయవచ్చు. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యం కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో Snapdragon 8s Gen 4 Mobile Platform, iQOO Supercomputing Chip Q1 ఉన్నాయి. AnTuTuలో 25 లక్షలకు పైగా స్కోర్ సాధించిన ఈ డివైస్ 144FPS స్థిరమైన గేమింగ్ పనితీరును అందిస్తుందని కంపెనీ చెబుతోంది. 6.78 అంగుళాల 1.5K AMOLED 144Hz డిస్‌ప్లే, 50MP Sony OIS ప్రధాన కెమెరా, అల్ట్రా వైడ్ లెన్స్, 32MP ఫ్రంట్ కెమెరా, 4K 60FPS వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Image (13)