
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లిలోని శాంతిఖని లాంగ్‌వాల్ గనిని బుధవారం నలుగురు సభ్యులతో కూడిన ఆస్ట్రేలియా నిపుణుల బృందం సందర్శించింది. గనిలో ఇంకా అపారమైన బొగ్గు నిల్వలు ఉన్న నేపథ్యంలో, ఆస్ట్రేలియా సాంకేతిక పరిజ్ఞానంతో బొగ్గు ఉత్పత్తిని కొనసాగించే అవకాశాలను పరిశీలించేందుకు ఈ బృందం గనిలోని పని ప్రదేశాలను పరిశీలించింది.
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరానికి చెందిన టాలియామన్ కన్సల్టెన్సీ కంపెనీ డైరెక్టర్ గ్రాంట్ పోల్డ్, జనరల్ మేనేజర్ జెరార్డ్ మిల్లర్, అహ్మదాబాద్‌కు చెందిన మైనింగ్ కన్సల్టెంట్ నందన్, ధన్‌బాద్‌కు చెందిన మైనింగ్ ప్రొఫెసర్ సిన్హా బృందంలో సభ్యులుగా ఉన్నారు.
గని పరిస్థితులు, సాంకేతిక అంశాలపై జీఎం రాధాకృష్ణతో పాటు ఇతర అధికారులతో నిపుణుల బృందం విస్తృతంగా చర్చించింది. అనంతరం తమ పరిశీలనల నివేదికను హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీఎండీకి సమర్పించనున్నట్లు సమాచారం.
ఆస్ట్రేలియా బృందానికి జీఎం రాధాకృష్ణ, గని మేనేజర్ సంజయ్‌కుమార్ సిన్హా, ప్రాజెక్టు అధికారి మొహమ్మద్ అబ్దుల్ ఖదీర్, కొత్త ప్రాజెక్టు అధికారి ఎస్. సంతోష్‌కుమార్, శాంతిఖని గ్రూప్ ఇంజనీర్ బసవరాజ్ స్వాగతం పలికారు.