Reading Time: < 1 minute

ఉప్పల్: మాజీ కార్పొరేటర్పై కేసు

Caption of Image.

ఉప్పల్, వెలుగు: సెన్సస్​డ్యూటీకి ఆటంకం కలిగించిన ఓ మాజీ కార్పొరేటర్‌‌తోపాటు మరి కొందరిపై ఉప్పల్​ పీఎస్​లో కేసు నమోదైంది. రామంతాపూర్​ వెంకట్‌‌రెడ్డి నగర్ డివిజన్​లోని అహ్మద్‌‌నగర్​లో సెన్సస్​ డ్యూటీ నిర్వహిస్తున్న ఎన్యూమరేషన్ టీంకు స్థానికులు ఉప్పల్ సర్కిల్ పరిధిలోకి రామంటూ వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. డీలిమిటేషన్​లో అహ్మద్​నగర్​ రోడ్​నంబర్లు- 9, 10లోని 47 ఇండ్లు ఉప్పల్ సర్కిల్​లో కలిశాయని డీసీ శైలజతోపాటు మున్సిపల్ అధికారులు అవగాహన కల్పించినా మొండిగా వాదించారు. 

అంబర్​పేట్​ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ విజయ్‌‌ కుమార్ గౌడ్, లోకల్ లీడర్లు బాబా, శ్రీకాంత్ తదితరులు బస్తీవాసుల వివరాలు సేకరించకుండా అడ్డు తగిలారు. గురువారం డీసీ ఫిర్యాదుతో వారిపై కేసు నమోదు చేసినట్లు ఉప్పల్​పోలీసులు తెలిపారు. కేసును అంబర్​పేట్​పీఎస్​కు బదిలీ చేస్తామని పేర్కొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.