Reading Time: 2 minutes

ఇండియన్ షూటింగ్ హిస్టరీలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్.. జస్పాల్ రాణా మృతి

Caption of Image.

భారత షూటింగ్ రంగంలో ఒక తరాన్ని తీర్చిదిద్దిన కోచ్, ఆసియా గేమ్స్ గోల్డ్ మెడలిస్ట్..  జస్పాల్ రాణా (49) మృతి చెందారు. భారత పిస్టల్ షూటర్లకు హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా పనిచేస్తున్న రాణా, మ్యూనిచ్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుండగా గుండెపోటుతో మరణించారు. కార్డియాక్ అరెస్టుతో శుక్రవారం (జూన్ 12) మృతిచెందడంతో క్రీడా ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగింది. 

మ్యూనిచ్‌లో జరిగిన ISSF ప్రపంచ కప్ నుండి భారతదేశానికి తిరిగి వస్తుండగా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు సమాచారం. న్యూఢిల్లీలో దిగిన తర్వాత, సాకేత్‌లోని మాక్స్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. 
వైద్యులు గుండెలో రక్త ప్రవాహానికి అడ్డంకిని గుర్తించి స్టెంట్ వేశారు. ఇప్పటికి బాగానే ఉంది.. రాబోయే రోజుల్లో రెండో స్టెంట్ వేయాల్సి ఉంటుందని  చెప్పారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని భావించినప్పటికీ.. ఉదయం మృతి చెందడం బాధాకరమైన విషయం.

  • మను భాకర్ పారా ఒలింపిక్స్ చేర్చిన కోచ్:

రాణా మరణం భారత షూటింగ్‌కు తీరని లోటు. దేశంలోని గొప్ప గొప్ప షూటర్లలో,  పేరు పొందిన కోచ్ లలో ఆయన ఒకరు. అనేక తరాల పిస్టల్ షూటర్లను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. మను భాకర్‌తో కలిసి చేసిన కృషికి రాణా విస్తృతంగా గుర్తింపు పొందారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మనుభాకర్ ను ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లలో కాంస్య పతకాలు గెలుచుకుని, స్వాతంత్ర్యం తర్వాత ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన మొదటి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు.

  • ద్రోణాచార్య అవార్డు:

భాకర్‌తో   రాణా సౌరభ్ చౌదరి, అనీష్ భాన్వాలా, చింకీ యాదవ్ వంటి పలువురు ప్రముఖ పిస్టల్ షూటర్లతో కలిసి పనిచేశారు. జూనియర్ ప్రోగ్రామ్‌తో ఆయన పదవీకాలం, అంతర్జాతీయ పోటీలలో భారతదేశానికి నిలకడగా ఫలితాలను అందించిన బలమైన షూటర్లను తయారు చేయడంలో ఆయన కృషి అమోఘం. 

నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (NRAI) 2025 ఫిబ్రవరిలో రాణాను 25 మీటర్ల పిస్టల్ విభాగానికి హై-పెర్ఫార్మెన్స్ కోచ్‌గా నియమించింది. ఐదు సంవత్సరాల క్రితం, కోచింగ్‌కు ఆయన చేసిన సేవలకు గాను ద్రోణాచార్య అవార్డును అందుకున్నారు.

  • పదేళ్లకు పైగా సాగిన కెరీర్.. బెస్ట్ షూటర్గా గుర్తింపు:

ఇండియాలో గొప్ప కోచ్‌లలో ఒకరిగా ఎదగక ముందే, రాణా అత్యుత్తమ పిస్టల్ షూటర్లలో ఒకరిగా నిరూపించుకున్నారు. 1976 జూన్ 28న ఉత్తరాఖండ్‌లో జన్మించిన రాణా, 1994లో అంతర్జాతీయ వేదికపై తన ఉనికిని చాటుకున్నారు. మిలన్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో, జూనియర్ విభాగంలో ప్రపంచ రికార్డు స్కోరుతో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. అదే సంవత్సరం తరువాత, ఆసియా క్రీడలలో 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి, అత్యున్నత స్థాయిలో పదేళ్లకుపైగా తన ఆధిపత్యాన్ని కొనసాగించారు.

రాణా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో పతకాలు గెలుచుకుని, అత్యంత సక్సెస్ ఫుల్ షూటర్లలో ఒకరిగా ఎదిగారు. 9 గొల్డ్ మెడల్స్  సహా 15 పతకాలు సాధించి, ఇప్పటికీ  ఇండియా సక్సెస్ ఫుల్ కామన్వెల్త్ గేమ్స్ షూటర్‌గా నిలిచాడు.

2006లో దోహాలో జరిగిన ఆసియా క్రీడలలో మూడు బంగారు పతకాలు గెలుచుకుని, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో ప్రపంచ రికార్డును సమం చేయడం రాణా కెరీర్ లోనే టాప్ పర్ఫామెన్స్ గా మిగిలిపోయింది.  18 ఏళ్ల వయసులో అర్జున అవార్డును అందుకుని, మూడేళ్ల తర్వాత పద్మశ్రీ పొందటం అంటే ఆయన ప్రతిభ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

1994, 1998, 2002, 2006 – ఇలా నాలుగు కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్లలో, ఇండియాకు డిపెండబుల్ చాంపియన్స్ లో ఒకరిగా నిలిచాడు. ఇండియాలో షూటింగ్‌ను బలమైన క్రీడాంశాలలో ఒకటిగా స్థాపించడంలో ఆయన కృషి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. 

©️ VIL Media Pvt Ltd.