
న్యూఢిల్లీ: కార్పొరేట్ కంపెనీల ఉద్యోగుల జీతాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8.6 శాతం నుంచి 10.2 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక తెలిపింది. నిపుణులకు ఉన్న డిమాండ్ కారణంగా ఈ వృద్ధి నమోదు కానుంది. ఈవీలు, ఈవీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఫార్మా రంగాల్లో పెంపు కొంత ఎక్కువ ఉండనుంది.
ఈవీ రంగంలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లకు 11.2 శాతం, క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్లకు 10.9 శాతం వేతనాల పెంపు లభించవచ్చు. ఆటో, రిటైల్, బీమా రంగాలలో 9.5 శాతం వరకు వృద్ధి ఉండవచ్చు. నగరాల వారీగా చూస్తే చెన్నై 9.7 శాతం పెంపుతో టాప్‌లో ఉంది.