Reading Time: < 1 minute

చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : దమ్మపేట జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జ్ భవాని

Caption of Image.

దమ్మపేట, వెలుగు: చట్టాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని దమ్మపేట జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి భవాని అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో న్యాయ సేవ అధికార కమిటీ సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్న చిన్న విషయాలకు కేసులు పెట్టుకునే పరిస్థితి తగ్గించుకుంటే మానసికంగా ఒత్తిడి తగ్గించుకున్న వారు అవుతారన్నారు. 

తప్పు చేసిన వారు పతనమవుతారు అదే వారికి పెద్ద శిక్ష అన్నారు. మూడు నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహిస్తామన్నారు. జూన్ 20 నిర్వహించే లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పగడాల రమాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గొంది మురళి మోహన్, అదనపు సబ్ ఇన్స్పెక్టర్ బాలస్వామి తదితరులు పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.