Reading Time: < 1 minute

మద్యం అమ్మినా.. కొనుగోలు చేసినా రూ. 5 లక్షల జరిమానా..సిద్దిపేట జిల్లాలో గ్రామం ఏకగ్రీవ తీర్మానం

Caption of Image.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం మక్త మాసాన్ పల్లి గ్రామం.. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో రోజురోజుకూ పెరిగిపోతున్న మద్యపాన మహమ్మారిపై అక్కడి మహిళలు, గ్రామస్తులు తిరుగుబాటు జెండా ఎగరేశారు. 

నిత్యం కొందరు తాగి వచ్చి ఇళ్లలో గొడవలు పడుతుండటంతో కాపురాలు కూలిపోయే పరిస్థితి దాపురించింది. దీనికి తోడు.. ఊరిలోని యువత కూడా మద్యానికి బానిసలై, రాత్రి వేళల్లో గొడవలకు దిగుతుండటంతో గ్రామంలో ప్రశాంతత కరువైంది. యువత భవిష్యత్తు నాశనమైపోతోందని గ్రామ పెద్దలు ఆందోళన చెందారు.

►ALSO READ | కెమికల్స్ వాడితే 16 ఏళ్లకే భయంకరమైన రోగాలు.. .ప్రకృతి వ్యవసాయం చేయండి: బండి సంజయ్

ఈ నేపథ్యంలోనే మక్త మాసాన్ పల్లి గ్రామం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది! మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చారు. ఊరి రచ్చబండ సాక్షిగా.. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఇకపై మక్త మాసాన్ పల్లి గ్రామంలో మద్యం అమ్మినా.. కొనుగోలు చేసినా.. ఏకంగా 5 లక్షల రూపాయల భారీ జరిమానా విధిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.ఈ నిబంధన ఉల్లంఘిస్తే ఎవరైనా సరే.. ఎంతటి వారైనా సరే.. ఉపేక్షించేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

 

©️ VIL Media Pvt Ltd.