Reading Time: 2 minutes

PEDDI Box Office: అసలు పరీక్ష ఇప్పుడే.. తగ్గుతున్న ‘పెద్ది’ కలెక్షన్స్.. బ్రేక్ ఈవెన్ సాధ్యమేనా?

Caption of Image.

‘పెద్ది’ రిలీజై వారం రోజులు గడుస్తున్నప్పటికీ, నిలకడైన కలెక్షన్స్ రాబడుతుంది. జాన్వీ పాత్రపై వివాదాలు చెలరేగినప్పటికీ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంటోంది. విడుదలై వారం రోజులు పూర్తికాకముందే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి తన సత్తా చాటింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణ సంస్థ ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి తొలి ఆరు రోజుల వసూళ్లను అధికారికంగా ప్రకటించింది.

అయితే భారీ స్థాయిలో బిజినెస్ జరుపుకున్న ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా దాదాపు రూ.85 కోట్లకు పైగా షేర్ వసూళ్లు అవసరమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, తొలి వీకెండ్ తర్వాత రోజురోజుకీ కలెక్షన్లు తగ్గుముఖం పడుతుండటంతో ‘పెద్ది’ ఫుల్ రన్‌లో బ్రేక్ ఈవెన్ మార్క్‌ను చేరుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఆరో రోజు రూ.9.65 కోట్ల వసూళ్లు!

మంగళవారం (6వ రోజు) దేశీయ బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ రూ.9.65 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. సోమవారం (జూన్ 8న) వచ్చిన రూ.12.05 కోట్లతో పోలిస్తే 19.9 శాతం తగ్గుదల. అంతకుముందు ఆదివారం రూ.32.15 కోట్లు వసూలు చేయగా, వర్కింగ్ డేస్ మొదలయ్యాక కలెక్షన్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.

వీకెండ్ వసూళ్లు..

ప్రీమియర్స్ (బుధవారం): రూ.18.50 కోట్లు
1వ రోజు (గురువారం): రూ.51 కోట్లు
2వ రోజు (శుక్రవారం): రూ.26.90 కోట్లు
3వ రోజు (శనివారం): రూ.29.10 కోట్లు
4వ రోజు (ఆదివారం): రూ.32.15 కోట్లు
5వ రోజు (సోమవారం): రూ.12.05 కోట్లు
6వ రోజు (మంగళవారం): రూ.9.65 కోట్లు
భారత్‌లో రూ.213 కోట్లకు పైగా గ్రాస్

ప్రీమియర్స్‌తో కలిపి ఆరు రోజుల్లో ‘పెద్ది’ భారత్‌లో రూ.213.23 కోట్ల గ్రాస్, రూ.179.35 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.332.1 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకుంది. అయితే, భారీ బడ్జెట్‌తో పాటు రికార్డు స్థాయి ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుపుకున్న నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా రెండో వారంలోనూ బలమైన వసూళ్లు కొనసాగించాల్సిన అవసరం ఉంది. వీకెండ్‌లో మళ్లీ కలెక్షన్లు పుంజుకుంటాయా? లేక తగ్గుదల కొనసాగుతుందా? అన్నది ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

‘పెద్ది’ బ్రేక్ ఈవెన్‌ టార్గెట్?

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ‘పెద్ది’ కి భారీ బిజినెస్ జరగడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్గా నిలవాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.400 నుండి రూ. 425 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంది. రూ.220 కోట్ల నెట్ వసూలు చేయాల్సి ఉంది. ఒకవేళ పెద్ది అదృష్టం బాగుండి రూ.450 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధిస్తే సూపర్ హిట్‌గా నిలిచే అవకాశం ఉంది. ప్రస్తుతం 6 రోజుల్లో రూ.331కోట్ల గ్రాస్, రూ.179 నెట్ ఉండగా.. ఇంకా 90 కోట్లకి పైగా గ్రాస్, 40 కోట్లకి పైగా నెట్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల టాక్. చివరికి ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.