Reading Time: < 1 minute
Andhra News: వేసిన తాళం వేసినట్టే ఉంచి.. డబ్బు, బంగారం కాజేస్తున్న కేటుగాళ్లు

తాళాలు పగలలేదు, పెద్దగా హడావుడి లేదు.. కానీ ఉదయం అయ్యేసరికి ఇంట్లోని విలువైన వస్తువులు మాత్రం మాయవుతున్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుసగా నాలుగు దొంగతనాలు జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అసలు దొంగల టార్గెట్ ఎవరు..? వారు ఎప్పుడు వస్తున్నారు..? ఎలా తప్పించుకుంటున్నారు..? అనే ప్రశ్నలకు సమాధానం దొరకకపోవడంతో స్థానికుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. ఇంతకూ ఇదంతా ఎక్కగ జరుగుతుందనేగా మీ అది తెలియాలంటే పూర్తి స్టోరీ చదవాల్సిందే.

ఒకే తరహాలో రెండు వారాల్లో వరుసగా నాలుగు చోట్ల దొంగతనాలు జరిగిన ఘటన నెల్లూరు జిల్లాలో తీవ్ర కలకం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. వెంకటాచలం పోలీస్ స్టేషన్ పరిధిలో గత రెండు వారాల్లో నాలుగు చోట్ల చోరీలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. వెంకటాచలం గ్రామంలోని గణేష్ గార్డెన్‌లో కె. రవి అనే వ్యక్తి ఇంట్లో ఇటీవలే రెండు సవర్ల బంగారం, రూ.10 వేల నగదు చోరీకి గురైంది. ఈ ఘటన జరిగి కొన్ని రోజులు కూడా కాకముందే అదే ప్రాంతంలో ఉపేంద్ర ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి యత్నించారు దుండగులు..

అలాగే వెంకటాచలం సత్రం గిరిజన కాలనీలో సత్య ఇంట్లో 30 సవర్ల బంగారం, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఇంతటిలో ఆగకుండా చెముడుగుంట గ్రామంలో లలితమ్మ ఇంట్లోనూ 30 సవర్ల బంగారం, రూ.30 వేల నగదును మాయం చేశారు.అయితే దొంగతనాల అన్ని ఒకే తరహాలో ఉండడంతో ఇది ఒకే గ్యాంగ్ చేసిన పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఇక ఇదే విషయంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చోరీల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించి రాత్రి పహారా బలోపేతం చేయాలని, వరుస చోరీలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ వరుస చోరీల నేపథ్యంలో జనం ఇంటిని వదిలి వెళ్లాలంటే భయపడిపోతున్నారు. ఎప్పుడు బయటికెళ్తే.. ఇంట్లో ఏం మాయమవుతుందోనని జంకుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.