అటుకుల బియ్యం పాయసం ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి ఇంకా ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. అలాగే, దీనిలో వేసే బెల్లం బాడీకి ఐరన్ ను అందిస్తుంది ఇంకా ఇది తిన్న వెంటనే శక్తినిస్తుంది ఇంకా ఇది తియ్య తియ్యగా నోటికి మంచిగా ఉంటుంది. ఇలా చేసి పిల్లల నుంచి పెద్దల వరకు తినొచ్చు.
అటుకుల బియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: అర కప్పు బియ్యం , అర కప్పు అటుకులు , ఒక లీటర్ పాలు , పావు కిలో బెల్లం లేదా చక్కెర, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 కిస్మిస్ లు, 10 జీడిపప్పులు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, అర కప్పు సగ్గుబియ్యం కూడా వేస్తే మంచిగా ఉంటుంది. ఇవి కలిపి పాయసం చేస్తే ఆ రుచి అద్భుతం
అటుకుల బియ్యం పాయసం తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని తీసుకుని బాగా కడిగి 20 నిమిషాలు పాటు నానబెట్టాలి. అయితే, ఇలా చేస్తే బియ్యం మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇలాగే అర కప్పు అటుకుల కూడా తీసుకుని అలాగే నానబెట్టుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని పాలు పోసి బాగా మరిగించాలి.
అటుకుల బియ్యం పాయసం తయారీ విధానం స్టెప్ 1 : అయితే,ఇప్పుడు అటుకులు, బియ్యం వేసి మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి. పాలు మొత్తం అడుగంటనివ్వకండి. బియ్యం కూడా మెత్తగా అయినా తర్వాత బెల్లం తురుము లేదా పంచదార వేయాలి. కానీ దీనిలో బెల్లంతో వేస్తేనే మంచిది.
ఇప్పుడు పొయ్యి వెలిగించి పాన్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ లు వేసి బంగారు రంగులోకి మారే వరకు బాగా వేయించాలి. ఆ తరవాత వీటిని తీసుకుని అటుకుల పాయసంలో వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. అలాగే, చివర్లో కొద్దిగా యాలకుల కూడా వేసి ఇంకా వీటితో పాటు ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి ఉడికించాలి




