Reading Time: 2 minutes

ఈ రోజుల్లో టీనేజ్ అమ్మాయిల్లో ‘పీసీఓఎస్’ (PCOS – పొలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్) లేదా పీసీఓడీ అనేది చాలా సాధారణమైన సమస్యగా మారిపోయింది. అయితే, ఈ వయసులో శరీరంలో వచ్చే మామూలు మార్పులకి, పీసీఓఎస్ లక్షణాలకి మధ్య తేడాను కనిపెట్టడం తల్లిదండ్రులకు కాస్త కష్టంగా ఉంటుంది. దీనివల్ల చాలా మంది ప్రారంభంలోనే ఈ సమస్యను గుర్తించలేకపోతున్నారు. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? టీనేజ్ గర్ల్స్‌లో కనిపించే ముందస్తు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు సింపుల్‌గా చూద్దాం.

అసలు పీసీఓఎస్ అంటే ఏంటి? : పీసీఓఎస్ అనేది శరీరంలోని రిప్రొడక్టివ్ (సంతానోత్పత్తి) హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే ఒక హెల్త్ కండిషన్. సాధారణంగా మహిళల శరీరంలో ప్రతి నెలా అండాశయం (Ovary) నుండి ఒక గుడ్డు విడుదల కావాలి. కానీ, ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు ఆ గుడ్డు సరిగ్గా ఎదగదు లేదా బయటకు విడుదల కాదు. దీనివల్ల అండాశయాలపై చిన్న చిన్న నీటి బుడగలు (Cysts) ఏర్పడతాయి.

Early Symptoms of PCOD in Teens Every Parent Should Know
Early Symptoms of PCOD in Teens Every Parent Should Know

వెనుక ఉన్న రెండు ముఖ్యమైన కారణాలు: పీసీఓఎస్ రావడానికి రెండు ముఖ్యమైన హార్మోన్ల సమస్యలు కారణమవుతాయి. మొదటిది శరీరంలో ‘ఆండ్రోజన్స్’ స్థాయిలు పెరగడం. ఇవి ఎక్కువైతే అండం విడుదల కాదు సగమే ఆగిపోతుంది. రెండోది ఇన్సులిన్ రెసిస్టెన్స్’. ఇక మన శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా వాడుకోలేనప్పుడు బ్లడ్ షుగర్ పెరిగి, బాడీ మరింత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది ఆండ్రోజన్ హార్మోన్లను ఇంకాస్త పెంచేలా చేస్తుంది.

పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం: ఏడాదికి 9 కంటే తక్కువ సార్లు మాత్రమే పీరియడ్స్ రావడం. ఇక నెలనెలా మారడం ఒక నెల త్వరగా వస్తే, మరో నెల చాలా ఆలస్యంగా రావడం.

ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం: పీరియడ్స్ 7 రోజుల కంటే ఎక్కువ రోజులు ఉండటం లేదా విపరీతమైన రక్తస్రావం కావడం.

పూర్తిగా ఆగిపోవడం: పీరియడ్స్ మొదలైన తర్వాత కూడా మధ్యలో వరుసగా కొన్ని నెలల పాటు అస్సలు రాకపోవడం.

టీనేజ్ వయసులోనే పీసీఓఎస్ లక్షణాలను గుర్తించి, సరైన లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం. ఇది కేవలం పీరియడ్స్ సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో ఇతర ఆరోగ్య ఇబ్బందులకు దారితీయవచ్చు. కాబట్టి అమ్మాయిల్లో పీరియడ్స్ తేడాలు గమనించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా సరైన గైడెన్స్ తీసుకోవాలి. మంచి ఆహారం, రోజువారీ వ్యాయామంతో ఈ సమస్యను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చు.

గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఇవ్వబడింది. మీ పిల్లల్లో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే, వెంటనే ఒక మంచి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించడం మరియు వారి సలహా మేరకు నడుచుకోవడం ఎంతో శ్రేయస్కరం.

The post టీనేజ్ గర్ల్స్‌లో PCOD..ప్రారంభ లక్షణాలు మిస్ అవ్వొద్దు! appeared first on Manalokam – Latest Telugu News & Updates.