Reading Time: < 1 minute

హైదరాబాద్ సిటీ: రూ.10 కోట్లకు పైగా ఈపీసీ టెండర్ల పర్యవేక్షణకు కమిటీలు

Caption of Image.

హైదరాబాద్ సిటీ, వెలుగు : సీఎంసీ, ఎంఎంసీ  పరిధిలో రూ.10 కోట్లకుపైగా పనుల టెండర్లను ఫైనల్ చేసేందుకు కమిటీ ఆమోదం ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పనుల గుర్తింపు, టెక్నికల్, ఫైనాన్సియల్ బిడ్డింగ్, టెండర్ కాలపరిమితి పెంచడంలో కూడా కమిటీదే తుది నిర్ణయమని డిసైడ్​చేసింది. పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో మూడు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. అయితే, ఈ కమిటీల్లో హెచ్ఎండీఏ, జలమండలి చీఫ్ ఇంజినీర్లకు కూడా అవకాశం కల్పించింది. 

జీహెచ్ఎంసీ పరిధిలో ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ అండ్ కన్స్ స్ట్రక్సన్​(ఈపీసీ) కమిటీల పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంసీ విభజనలో భాగంగా ఏర్పాటైన రెండు చోట్ల ప్రస్తుతం కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టబోయే అన్ని ఈపీసీ పనులకు ఈ కొత్త కమిటీల విధానం వర్తించనుంది. టెండర్లను ఆమోదించే రెండో కమిటీలో అడిషనల్ కమిషనర్(పనులు)కు బదులు సంబంధిత సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్ఈ)ని కన్వీనర్ గా పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

©️ VIL Media Pvt Ltd.