Reading Time: < 1 minute
DRDO Internship 2026: జాబ్ కాకపోయినా జాక్‌పాట్ లాంటి అవకాశం.. DRDOలో స్టైపెండ్‌తో ఇంటర్న్‌షిప్‌లు!

కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) ఆధ్వర్యంలోని పూణెలోని ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) 2026-27 విద్యా సంవత్సరానికిగానూ పెయిడ్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ కోసం అర్హులైన ఇంజినీరింగ్ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 40 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌లను 6 నెలల పాటు శిక్షణ వ్యవధిలో అందిస్తారు. శిక్షణ సమయంలో నిబంధనల మేరకు స్టైపెండ్‌ కూడా చెల్లిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 జులై 5వలోపు ఆఫ్‌లైన్‌ విధానంలో స్పీడ్ పోస్ట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మెకానికల్, ఆల్మామెంట్, ప్రొడక్షన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఐటీ, ఎయిరో ఇంజినీరింగ్, రాకెట్ ప్రొపల్షన్, ఎలక్ట్రికల్, మెటీరియల్ సైన్స్.. తదితర విభాగాల్లో ఈ ఇంటర్న్‌షిప్‌లను అందించనున్నారు. ఇతర వివరాలు ఈ కింద చెక్‌ చేసుకోండి..

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూషన్ నుంచి సంబంధిత విభాగంలో రెగ్యులర్ కోర్సు ద్వారా బీఈ లేదా బీటెక్‌లో 7వ లేదా 8వ సెమిస్టర్ చదువుతూ ఉండాలి. లేదా ఎంటెక్ మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతుండాలి. ఎలాంటి బ్యాక్‌లాగ్‌లు ఉండకూడదు. అకడమిక్ రికార్డులో కనీసంద 75 శాతం మార్కులు లేదా 7.5 సీజీపీ ఉండాలి. అభ్యర్ధుల వయసు జూన్‌ 20, 2026వ తేదీ నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన వారు ఈ కింది చిరునామాకు దరఖాస్తులను పోస్టు ద్వారా ఆఫ్‌లైన్‌ విధానంలో జులై 5, 2026వ తేదీలోపు పంపించాలి. అకడమిక్ మార్కుల మెరిట్‌ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.5 వేలు చొప్పున స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇంటర్న్‌షిప్‌ జులై 30, 2026వ తేదీ నుంచి మొదలవుతుంది.

దరఖాస్తు్లో తాజాగా దిగిన పాస్ పోర్టు ఫొటోలు, కాలేజీ ప్రిన్సిపల్ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌, సెమిస్టర్ మార్క్‌ షీట్లు, ఆధార్‌ కార్డు కాపీ, కాలేజీ ఐడీ కాపీ, సూడెంట్ బయోడేటా 300 పదాల్లో పంపించాలి.

అడ్రస్‌..

ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్, డాక్టర్ హోమి బాబా రోడ్, పాషాణ్, పుణె – 411021.

డీఆర్‌డీఓలో పెయిడ్‌ ఇంటర్న్‌షిప్‌ల కోసం ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.