Reading Time: < 1 minute

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

Caption of Image.

ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి.  గురువారం (2026  జూన్ 11) ఫలితాలను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్మీడియట్  ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (TGBIE) ఆన్‌లైన్ ద్వారా విడుదల చేసింది. 

ఇంటర్ ఫస్ట్ ఈయర్ పాస్ పర్సంటేజ్ 68.84 శాతం వచ్చింది. అదే సమయంలో  సెకండ్ ఈయర్ లో 49.29 శాతం విద్యార్థులు పాసయ్యారు. మే, జూన్ నెలల్లో ఈ పరీక్షలకు హాజరైన జనరల్, ఒకేషనల్ స్ట్రీమ్ విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు.

కింద పేర్కొన్న వెబ్‌సైట్ల ద్వారా విద్యార్థులు తమ మార్కులను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ వెబ్ సైట్ల ద్వారా రిజల్డ్ తెలుసుకోవచ్చు. 

tgbie.cgg.gov.in, 

results.cgg.gov.in

మే 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,98,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్ కౌన్సెలింగ్, డిగ్రీ, ఇతర కోర్సుల్లో అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఫలితాలు విడుదల చేశారు అధికారులు. 

©️ VIL Media Pvt Ltd.