
ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో దేశ తలరాత మారిపోయిందని ప్రధాని మోడీ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి నేటితో పన్నెండేళ్లు పూర్తైంది. అంతేకాకుండా ప్రధానిగా మోడీ.. నెహ్రూ రికార్డ్‌ను అధిగమించారు. దీంతో ఢిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీఏ నేతలు సమావేశమై మోడీని సన్మానించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
‘‘నాకు ప్రజలే దైవ స్వరూపం. ఈ రాజకీయ ప్రయాణంలోని ఎన్నో ఒడిదుడుకులను చూసిన నేను.. ఈ క్షణం వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. ఎన్నికైన ప్రధానమంత్రిగా వరుసగా అత్యంత సుదీర్ఘ కాలం పాటు సేవ చేసే అవకాశం లభించడం నా జీవితంలో లభించిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంగా నన్ను గౌరవించి.. ఇంతటి గౌరవాన్ని అందించిన మీ అందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత సుదీర్ఘ కాలం పాటు మాతృభూమికి సేవ చేసే భాగ్యం లభించడం కేవలం దైవ కృప వలనే సాధ్యమైంది. నా దృష్టిలో ప్రజలే దైవ స్వరూపం. నేను సేవను ఎల్లప్పుడూ ఒక ఆధ్యాత్మిక సాధనగా భావిస్తాను. ఇది ఒక సామూహిక త్యాగం, ఇందులో మీరందరూ కర్తవ్య భావంతో తమ వంతు సహకారం అందించారు.’’ అని తెలిపారు.
‘‘గత పన్నెండేళ్లలో 25 లక్షల మందిని పేదరికం నుంచి విముక్తి కలిగించాం. కాంగ్రెస్ ద్రోహం చేసిన తర్వాత.. దేశ ప్రజలు తమ నమ్మకాన్ని మాపై ఉంచారు. ఎన్డీఏ కుటుంబంగా దేశ ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేశామన్నందుకు ఈ రోజు నేను గర్వపడుతున్నాను. ప్రభుత్వం సదుద్దేశంతో పనిచేసినప్పుడు దేశం అభివృద్ధి పథంలో పురోగమిస్తుందని దేశ ప్రజలు చూశారు. 25 కోట్ల మంది ప్రజలు పేదరికపు రేఖకు పైకి రావడం మన విధానాలు సరైనవని చూపిస్తుంది.’’ అని అన్నారు.
#WATCH | Delhi: Addressing the NDA leaders’ meeting, Prime Minister Narendra Modi says, “The Congress dragged the country into multi-crore rupee scams. The nation’s destiny changed again when the NDA government was formed in 2014. The country witnessed the pace of development… pic.twitter.com/mFRTZgoWun
— ANI (@ANI) June 10, 2026
#WATCH | Delhi: Addressing the NDA leaders’ meeting, Prime Minister Narendra Modi says, “The Congress had plunged the country into an abyss of helplessness, destitution, and an inferiority complex. The nation was conditioned to believe that development in India inevitably moves… pic.twitter.com/E6gs3T7qPQ
— ANI (@ANI) June 10, 2026
#WATCH | Delhi: Addressing the NDA leaders’ meeting, Prime Minister Narendra Modi says, “… A major success of the NDA’s 12 years in power is that the country has broken free from the web of Congress’s machinations… Today, every citizen of the country is filled with the dream… pic.twitter.com/y4QM5yhfZr
— ANI (@ANI) June 10, 2026
#WATCH | Delhi: Addressing the NDA leaders’ meeting, Prime Minister Narendra Modi says, “I believe that we must not let those who were poor yesterday, and have now become the ‘neo middle class’, slip back. Therefore, as a government and as public representatives, we must work day… pic.twitter.com/qabLymyEKS
— ANI (@ANI) June 10, 2026