
ఒమన్ తీరంలోవాణిజ్య నౌకలపై దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ నౌకలపై అమెరికా సైన్యం జరిపిన కాల్పులపై వివరణ కోరుతూ అమెరికా రాయబారి కి సమన్లు ఇచ్చింది. న్యూఢిల్లీలోని ఓ సీనియర్ డిప్లమాట్ జాసన్ మీక్స్ ను పిలిపించింది. 48 గంటల్లో అమెరికా అధికారిని పిలిపించడం ఇది రెండో సారి. గురువారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకపై దాడి జరిగిన క్రమంలో భారత్ ఈ దౌత్యపరమైన చర్యలు చేపట్టింది.
గురువారం ఒమన్ తీరంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న నౌకపై అమెరికా సైన్యం దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ముగ్గురు సిబ్బంది చనిపోయారు. భారతీయ నౌకలపై అమెరికా నౌకాదళం నేరుగా దాడిచేసినట్లు తొలిసారి భారత్ బహిరంగంగా ప్రకటించడం ఇదే తొలిసారి. నాలుగు రోజులు వ్యవధిలో ఒమన్ తీరంలో మూడు నౌకలపై అమెరికా దాడులు చేసిందని ప్రకటించింది.
ALSO READ : ఇండియా నుంచి ఎండు మిర్చి కొనొద్దు..
భారత్ నౌకలపై కొనసాగుతున్న దాడులను తీవ్రంగా నిరసరించిన భారత్.. అమెరికా రాయబారిని పిలిపించి వివరణ కోరినట్లు విదేశాంగ మంత్రి జైస్వాల్ అన్నారు. అమెరికా సైనక చర్యలను తక్షణమే నిలిపివేయాలని గట్టిగా చెప్పినట్లు తెలిపారు. కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గాలను పరిరక్షించేందుకు దౌత్యమార్గాల్లో ప్రయత్నించాలని భారత్ పిలుపునిచ్చింది.