Reading Time: < 1 minute

రాష్ట్ర అభివృద్ధి కోసమే 21 సీట్లు తీసుకున్నాం.. 21 సీట్లతో రాజీపడలేదు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Caption of Image.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తైన సందర్భంగా శుక్రవారం ( జూన్ 12 ) తిరుపతిలో సుపరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 2024లో ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో ఏపీలో మళ్ళీ కొత్త ఆశలు చిగురించాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే 21 సీట్లు తీసుకున్నామని.. 21 సీట్లతో రాజీపడలేదని అన్నారు పవన్ కళ్యాణ్.

ఏపీలో 2024 ఎన్నికల తీర్పుతో ఒక తరం భవిష్యత్తుకు నమ్మకం కలిగిందని అన్నారు. ఈ తీర్పు అహంకారం, విధ్వంసంపై ప్రజస్వామ్యం సాధించిన విజయం అని అన్నారు పవన్ కళ్యాణ్. ప్రజలు మౌనంగా కనిపించినా, చరిత్రను మార్చగలరని నిరూపించారని అన్నారు.ప్రజలు రెండేళ్ల క్రితం కూటమికి కేవలం అధికారమే కాదు… బాధ్యత ఇచ్చారని అన్నారు. ఎన్డీయే కూటమి సమిష్టి కృషితో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని..దురదృష్ట వశాత్తు స్టీల్ ప్లాంట్ లో దుర్ఘటన జరిగిందని అన్నారు పవన్ కళ్యాణ్.  

తెలుగు రాష్ట్రాలు మరింత అభివృద్ధి చెందాలంటే… ఒక ప్రాంతం కులాల మరిమితులు దాటాలని, మరో ప్రాంతం ప్రాంతీయత నుంచి బయటకు రావాలని… జాతీయవృద్ధి ముందుకు రావాలని అన్నారు. నేను నా శాఖను తీసుకున్నపుడు బ్లీచింగ్ కొనటానికి… జెండా పండగ చేయటానికి కూడా నిధులు లేదనే సమాధానాలు వచ్చాయని అన్నారు. ప్రజల జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు గ్రామీన స్థాయిలోనే జరగాలని.. గ్రామానికి  ఎక్కడ రోడ్డు కావాలి? ఎవరికి ఇల్లు కావాలి? అనేది కార్యాలయాల్లో కాదు. ప్రజల మధ్య జరగాలని అన్నారు.

గ్రామ సభ బలపడితే సర్పంచ్ బలపడుతాడని… అపుడే ప్రతి చిన్న సమస్య స్థానిక ఎమ్మెల్యే టేబుల్ దగ్గరికి రావాల్సిన పని లేదని అన్నారు. అప్పుడు ఎమ్మెల్యేలు యువత భవిష్యత్తుపైన, పరిశ్రమలపై దృష్టి పెడతారని అన్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకత్వం తయారు చేసేది గ్రామాలేనని.. రాష్ట్రపతి ముర్ము రాజకీయ ప్రయాణం గ్రామస్థాయిలో మొదలైందని అన్నారు.

©️ VIL Media Pvt Ltd.