
దేశంలో సిట్టింగ్ స్థానాలను, రూలింగ్ పార్టీలను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం SIR తీసుకొచ్చిందని విమర్శించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. సర్ ముసుగుతో ఓటర్లను తొలగించడం ప్రజాస్వామ్య విరుద్ధం అని అన్నారు. గురువారం (జూన్ 11) మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గద్దెరాగడి MNR గార్డెన్స్ లో ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా -SIR పై BLA ల కు అవగాహన శిక్షణ కార్యక్రమం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రకారం రాజ్యసభ సీటును మీనాక్షి నటరాజన్ కు కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తే ఆమె నామీనేషన్ ను తిరస్కరించిందని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగలమడుతోందని మండిపడ్డారు. నీట్ పేపర్ లీక్ లు చేసింది బీజేపీ మంత్రులేనని ఆరోపించారు.
కేటీఆర్ కు అధికారం కోల్పోయాక మతి భ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 ATC సెంటర్ ల ద్వారా 25 వేల మంది విద్యార్థులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. టామ్ కామ్ ద్వారా 10 వేల మంది యువతకు జర్మనీ లో ఉపాధి అవకాశాలు ప్రజాపాలన కల్పిస్తుందని గుర్తు చేశారు.
చెన్నూరు నియోజక వర్గ ప్రజలకు అనేక సంక్షమ పథకాలను అందిస్తూ అభివృద్ధి కి పాటుపడుతునట్లు చెప్పారు ఎంపీ వంశీకృష్ణ. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు మంత్రి వివేక్ వెంకటస్వామి కృషి చేస్తున్నారని కొనియాడారు.