
బెంగళూరు: కర్నాటక నుంచి రాజ్యసభకు నలుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. వీరిలో కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పవన్ ఖేరా, మన్సూర్ అలీ ఖాన్.. బీజేపీ నుంచి ఎం.నాగరాజ ఉన్నారు.
ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఈరన్న కడాడి, నారాయణ కొరగప్ప (బీజేపీ), ఖర్గే (కాంగ్రెస్), మాజీ ప్రధాని దేవెగౌడ (జేడీఎస్) పదవీ కాలం జూన్ 25తో ముగియనుండటంతో ఈ నాలుగు స్థానాలకు ఎన్నికలు ప్రకటించారు. 18న పోలింగ్ జరగాల్సి ఉండగా, గురువారం నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిశాక బరిలో ఈ నలుగురు అభ్యర్థులే మిగలడంతో వారంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఎన్నికైన అభ్యర్థులకు కర్నాటక సీఎం డీకే శివకుమార్ అభినందనలు తెలిపారు.