
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. విలాసానికి.. ఐశ్వర్యం.. సంపద కలుగజేసే శుక్రుడు … శని భగవానుడి పుష్యమి నక్షత్రంలో కి ప్రవేశించాడు. అక్కడే 2026 జూన్ 22 వరకు ఉంటాడు. శుక్రుడు కర్కాటక రాశి.. పుష్యమి నక్షత్రంలో సంచారం వలన ఐదు రాశుల వారికి జీవితాల్లో ఊహించని సానుకూల మార్పులు రాబోతున్నాయి. వృత్తి, వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలిగిపోయి ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు ఆ రాశుల గురించి తెలుసుకుందాం. . !
మేషరాశి: ఈ రాశిలో శుక్రుడు నాలుగవ ఇంట్లో సంచరిస్తున్నాడు. ఈ రాశి వారికి అనుకోని విజయాలు కలుగుతాయి. కొత్తగా గృహ నిర్మాణ పనులు చేపట్టే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం, కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. పట్టుదలతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం భారీగా పెరిగి కొత్త పనులు చేపట్టడానికి ఉత్సాహం వస్తుంది. కొత్తగా ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఉద్యోగస్తులకు వేతనం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఊహించని లాభాలు అందుకుంటారు. మీ కష్టానికి మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. మీ ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. వృత్తి, వ్యక్తిగత జీవితం బ్యాలెన్స్ చేసుకోవడంలో విజయం సాధించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ రాశికి అధిపతి శుక్రుడు. కాబట్టి ఈ గ్రహ సంచారం చాలా ప్రత్యేకంగా అనుకూలమైనదని పండితులు చెబుతున్నారు. అన్నీ రకాల ప్రతికూల పరిస్థితుల నుంచి భారీ ఊరట కలుగుతుంది. కొంతకాలంగా ఆగిపోయిన పనుల్లో కదలిక ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో కీలక బాధ్యతలు పోషించాల్సి ఉంటుంది. కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకొనే అవకాశం ఉంది. టెక్నికల్ రంగంలో ఉన్న వారు కొత్త ప్రాజెక్ట్ లు చేపడతారు. వ్యాపారస్తులకు ఊహించని లాభాలుంటాయి. ఆర్థిక పరిస్థి తి బలపడుతుంది. పూర్వీకుల ఆస్తి కలసి వస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు కలసివస్తాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: శుక్రుడు పుష్యమి నక్షత్రంలోకి మారడం వలన ఈ రాశి వారికి జూన్ 22 వరకు అన్ని విధాలుగా మంచి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో పరిష్కారం కాని ఆస్తి సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంశలు వస్తాయి. ప్రమోషన్ తో పాటు వేతనం పెరిగే అవకాశం ఉంది. వీరికి కెరీర్ పరంగా అద్భుతంగా కలిసి వస్తుంది.వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది.
తులా రాశి: ఈ రాశి వారికి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి అకస్మాత్తుగా లాభాలు వస్తాయి. ఎంతో కాలంగా అమ్ముడుకాని వస్తువులకు గిరాకీ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనులకు పరిష్కారం లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. జాబ్ మారేందుకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉందని ఆస్ట్రాలజిస్టుల అంచనా. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ఖర్చులపై నియంత్రణ సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయాల్లో కూడా సానుకూల మార్పులు కనిపిస్తాయి. ఇంటి వాతావరణం ఆనందంగా మారి, కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడిపే అవకాశం లభిస్తుంది.
మకర రాశి : ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు ఈ కాలంలో టీమ్ లీడర్ గా వ్యవహరించే అవకాశం ఉంది. విద్యార్థులు చదువుపై ఏకాగ్రతను కాపాడుకునేందుకు అదనంగా శ్రమించాల్సి వస్తుంది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతాయి. ఉద్యోగస్తులకు అన్ని విధాలా సానుకూలంగా ఫలితాలు వస్తాయి. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెడితే అనుకోని లాభాలు చేకూరుతాయి. గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడంతో ఆనందంగా గడుపుతారు. ఆఫీసులో ఉన్నతాధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి కలసి రావడంతో ఆర్థికంగా బలపడతారు. జూన్ 11 నుంచి 22 వరకు ఉండే ఈ 12 రోజుల్లో మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం