
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి జీవితంలో జరిగే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. ఇది వారి భవిష్యత్తు, భాగస్వామి, ఉద్యోగం లేదా వ్యాపారం వంటి వివరాలను వెల్లడిస్తుంది. అంతేకాదు, మీ భార్య పుట్టిన తేదీని బట్టి ఆమె మీకు ‘రహస్య రాజయోగం’ (అదృష్టం) తెస్తుందో లేదో కూడా తెలుసుకోవచ్చు. మీ భార్య పుట్టిన తేదీని బట్టి వచ్చే సంఖ్య ఆధారంగా ఫలితాలు ఎలా ఉంటాయో ఇక్కడ చూద్దాం….
1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు
ఈ తేదీల్లో పుట్టిన భార్యలు వారి భర్తల గౌరవాన్ని, సమాజంలో వారి హోదాను, నాయకత్వ లక్షణాలను పెంచుతారు. ఇలాంటి భార్యలను గౌరవించడం వల్ల భర్తలకు కీర్తి, మంచి గుర్తింపు లభిస్తాయి. కాబట్టి వీరితో అహంకారంతో లేదా అగౌరవంగా ప్రవర్తించకూడదు.
2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారు
ఈ సంఖ్య గల భార్యలు ఇంట్లో ప్రశాంతతను, నెమ్మదిని ఇస్తారు. దీనివల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది. మీ భార్య ఈ తేదీల్లో పుట్టి ఉంటే, ఆమెను ఎప్పుడూ సంతోషంగా ఉంచాలి. అలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి, భార్యాభర్తల బంధం మరింత మధురంగా మారుతుంది.
3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు
వీళ్ళు వారి భర్తలకు ఎంతో అదృష్టాన్ని తెచ్చిపెడతారు. సుఖదుఃఖాలలో తోడుగా ఉండే ఉత్తమ భాగస్వాములుగా నిలుస్తారు. సమాజంలో భర్త స్థాయి పెరగడానికి కారణమవుతారు. వీళ్ళు మంచి సలహాదారులుగా ఉంటూ కుటుంబాన్ని చక్కగా మేనేజ్ చేస్తారు. కాబట్టి, ఈ తేదీలలో పుట్టిన భార్యలు చెప్పే సలహాలను భర్తలు తప్పకుండా వినాలి.
6, 15, 24 తేదీల్లో పుట్టినవారు
ఈ తేదీల్లో జన్మించిన భార్యలను సాక్షాత్తూ లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. వీరిని చాలా ప్రేమగా, గౌరవంగా చూసుకోవాలి. అలా చేస్తే జీవితంలో మంచి ఎదుగుదల, సంపద లభిస్తాయి. ఒకవేళ భార్యను నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఆర్థిక నష్టాలు రావచ్చు, సమాజంలో పరువు పోవచ్చు.
►ALSO READ | జ్యోతిష్యం : ఉద్యోగంలో ఏ తిధులు.. వారాలు, నక్షత్రాల్లో చేరాలో తెలుసుకోండి..
8, 17, 26 తేదీల్లో పుట్టినవారు
8వ సంఖ్యగల భార్యలు చాలా కష్టపడే తత్వం ఉన్నవారు. ఇల్లు, కుటుంబాన్ని చక్కబెట్టడంలో వీరు నిపుణులు. భర్తకు అదృష్టం కలిసివచ్చేలా చేయడంలో సహాయపడతారు. వీరికి ఇవ్వాల్సిన ప్రేమ, గౌరవం ఇస్తే.. భర్త జీవితంలో ఎదురయ్యే ఎలాంటి అడ్డంకులైనా వాటంతట అవే తొలగిపోతాయి.
గమనిక: మీ భార్య పుట్టిన తేదీలోని అంకెలను విడివిడిగా కూడితే వచ్చే ఒకే అంకె ఆధారంగా ఈ సంఖ్యను లెక్కించవచ్చు. ఉదాహరణకు: 28వ తేదీ అయితే 2 + 8 = 10, మళ్లీ 1 + 0 = 1 (మూల సంఖ్య 1 అవుతుంది).