Reading Time: < 1 minute
Renault Duster New Variant Coming Soon Delivers 19 Km Mileage

Renault Duster: రెనాల్ట్ డస్టర్ ఎంట్రీతో సంచలనాలు సృష్టిస్తోంది. పూర్తిగా మారిన డిజైన్, బోల్డ్ లుక్స్, అనేక వేరియంట్లు, ఇంజన్ ఆప్షన్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. భారత్‌లో విడుదల తర్వాత ఏకంగా 5000 బుకింగ్స్ అందుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు డస్టర్ తక్కువ ధరలో ఆటోమేటిక్ వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది. ఈ ఆటోమేటిక్ వేరియంట్ 1.3 లీటర్ టర్బో పెట్రోల్ డీసీటీ మోడల్ కన్నా తక్కువ ధరలో ఉండే అవకాశం ఉంది. ఈ ఎత్తుగడతో డస్టర్ తన సేల్స్ పెంచుకోవాలని భావిస్తోంది.

చౌక ధరల్లో మరో వేరియంట్..

తక్కువ ధరతో ఆటోమేటిక్ వేరియంట్ తీసుకురావడం వల్ల కస్టమర్లను ఆకర్షించవచ్చని కంపెనీ భావిసోతోంది. త్వరలోనే 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆటోమెటిక్ తీసుకురాబోతున్నామంటూ కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం డస్టర్‌లో అత్యంత చౌకౌన ఆటోమేటిక్ వేరియంట్ 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ధర రూ. 14.49 లక్షలుగా ఉంది. కొత్తగా రాబోకే వేరయంట్‌ దీని కన్నా తక్కువ ధరలోనే ఉంటుందని వినికిడి. కాగా, 1.0-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ మరియు 1.3-లీటర్ ఆటోమేటిక్ వేరియంట్‌ల మధ్య ధరలో పెద్ద తేడా ఉండటంతో, వీటి మధ్య మరో వేరియంట్ వచ్చే ఛాన్స్ ఉంది.

1.0 ఇంజన్ CVT గేర్ బాక్స్‌..

కంపెనీ అధికారికంగా ఇంజన్ వివరాలు వెల్లడించకున్నా 1.0 లీటర్ ఇంజన్‌తో CVT గేర్ బాక్స్‌తో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం డస్టర్ ఇండియన్ మార్కెట్‌లో మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. ప్రస్తుతం, ఇది 1.0-లీటర్ టర్బో పెట్రోల్, 1.3-లీటర్ టర్బో పెట్రోల్ అనే రెండు ఇంజన్ ఆప్షన్లను అందిస్తోంది. మూడవ ఇంజన్‌గా 1.8-లీటర్ పెట్రోల్ + హైబ్రిడ్ రానుంది. హైబ్రిడ్ ఇంజన్ దీపావళికి కంపెనీ రిలీజ్ చేయాలని భావిస్తోంది. ఇది పెట్రోల్, మోటార్‌తో రన్ అవుతుంది.

19 కిలోమీటర్ల మైలేజ్..

డస్టర్ తన 1.0 టర్బో పెట్రోల్ ఇంజన్ మైలెజ్ వివరాలను ఇటీవల వెల్లడించింది. ఈ వేరియంట్ లీటర్‌కు రూ. 19.41 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. 1.3-లీటర్ టర్బో పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ లీటరుకు 17.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుండగా, DCT ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.45 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.