Reading Time: 2 minutes

2027 వరల్డ్ కప్ షెడ్యూల్ ఫిక్స్.. కోహ్లీ-రోహిత్‌కు ఇదే చివరి ప్రపంచకప్?

Caption of Image.

2027 ODI World Cup: క్రికెట్ ఫ్యాన్స్‌కు ఐసీసీ (ICC) ఒక మైండ్ బ్లాక్ అయ్యే క్రేజీ అప్‌డేట్ ఇచ్చింది. 2027లో జరగబోయే మెన్స్ వన్డే వరల్డ్ కప్ (ODI World Cup 2027) షెడ్యూల్ డేట్స్ దాదాపు ఖరారయ్యాయి. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు కలిసి సంయుక్తంగా నిర్వహించబోతున్న ఈ మెగా టోర్నమెంట్‌ను వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు నిర్వహించాలని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు మీటింగ్‌లో డిసైడ్ అయ్యారు. ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఐపీఎల్ 2026 ఫైనల్ టైమ్‌లోనే ఐసీసీ సభ్యులంతా కలిసి ఈ డేట్స్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. 

సౌతాఫ్రికాలోనే ఎక్కువ మ్యాచ్‌లు:
24 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత సౌతాఫ్రికా గడ్డపై మళ్లీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. (లాస్ట్ టైమ్ 2003లో అక్కడ వరల్డ్ కప్ జరిగింది). 
* టోటల్ మ్యాచ్‌లు: ఈ టోర్నమెంట్‌లో మొత్తం 54 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ 54 మ్యాచ్‌లలో ఎక్కువ శాతం (41 మ్యాచ్‌లు) సౌతాఫ్రికాలోనే జరగనున్నాయి. జింబాబ్వేలో 8 మ్యాచ్‌లు, నమీబియాలో 3 మ్యాచ్‌లు నిర్వహిస్తారు.

* ఫ్యూచర్ టూర్స్ ప్లాన్: 2027–2031కి సంబంధించిన ఐసీసీ కొత్త క్యాలెండర్‌లో ఇదే ఫస్ట్ టోర్నమెంట్.. ఈ ఏడాది చివర్లో హాంగ్‌కాంగ్‌లో జరగబోయే మీటింగ్‌లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)ను ఇంకా పెద్దగా విస్తరించడంపై అఫీషియల్ నిర్ణయం తీసుకోనున్నారు.

రోహిత్, కోహ్లీలకు మిగిలింది ఏడాదిన్నర: 
ఈ వరల్డ్ కప్ అప్‌డేట్‌తో టీమిండియా లెజెండ్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫ్యాన్స్‌కు కొంచెం ఎమోషనల్ ముచ్చట కూడా బయటకొచ్చింది. ఎందుకంటే 2027 వన్డే వరల్డ్ కప్ వీళ్లిద్దరికీ ఆఖరి ఐసీసీ టోర్నమెంట్ (Swansong Tournament) అయ్యే ఛాన్స్ వంద శాతం ఉంది. ప్రస్తుతం రోహిత్‌కు 39 ఏండ్లు, కోహ్లీకి 37 ఏండ్లు ఉన్నాయి. వీళ్లిద్దరు ఇప్పటికే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించేశారు. ఇప్పుడు కేవలం వన్డే ఫార్మాట్ మాత్రమే ఆడుతుండటంతో.. రాబోయే ఏడాదిన్నర కాలం పాటు కేవలం ఒకే ఒక ఫార్మాట్ ఆడుతూ, వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీకి తమను తాము ఎలా ఫిట్‌గా ఉంచుకుంటారనే చర్చ నడుస్తోంది. కాగా విరాట్ కోహ్లీ వన్డేల్లో రికార్డులతో దుమ్ములేపుతుండగా.. రోహిత్ శర్మ కూడా తన ఫిట్‌నెస్, మెంటల్ హెల్త్‌పై మస్తు ఫోకస్ పెడుతున్నాడు.

 

©️ VIL Media Pvt Ltd.