Reading Time: 2 minutes

Alpha Teaser: యాక్షన్ మోడ్‌లో ఆలియా భట్.. మైండ్ బ్లాక్ చేస్తున్న ‘ఆల్ఫా’ టీజర్!

Caption of Image.

వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్ నుంచి వస్తోన్న ఫస్ట్ ఫిమేల్ సెంట్రిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha) . ఈ మూవీలో  బాలీవుడ్ క్వీన్ ఆలియా భట్ లీడ్ రోల్‌లో నటిస్తుంది.  ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ టీజర్‌ను యష్ రాజ్ ఫిల్మ్స్ లేటెస్ట్ గా  రిలీజ్ చేసింది.  యూక్షన్ తో ఆలియా అదరగొట్టింది.1 నిమిషం 55 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కథేంటంటే.. 

టీజర్ ఓ ఇంట్రెస్టింగ్ సీన్‌తో స్టార్ట్ అవుతుంది. ఆలియా భట్ తన 18వ బర్త్‌డేను తండ్రి (బాబీ డియోల్)తో కలిసి ఒక లగ్జరీ హోటల్‌లో సెలబ్రేట్ చేసుకుంటుంది. అక్కడే ఆమెకు ఊహించని బర్త్‌డే గిఫ్ట్ దక్కుతుంది. అదే.. ఆమె ఫస్ట్ మిషన్. సీక్రెట్ సోల్జర్ ఇనిషియేటివ్ ‘ఆల్ఫా’ కోసం ఆలియాకు చిన్నప్పటి నుంచే కఠినమైన శిక్షణ ఇస్తాడు తండ్రి. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే యాక్షన్ సీక్వెన్సెస్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తూ.. అదిరిపోయే ఇంటెలిజెన్స్ టెక్నిక్స్‌తో ఆలియా చేసే ఫైట్స్ నెక్స్ట్ లెవెల్. ఇక టీజర్ చివర్లో ఆలియా భట్ ఒకడి తలలోకి బుల్లెట్ దింపే సీన్ అయితే గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

భారీ అంచనాలతో..

‘ది రైల్వే మెన్’ ఫేమ్ శివ రావల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఉదయ్ చోప్రా కథనందించారు. రోహన్ష్-అబీర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ విజువల్ వండర్ జూలై 3, 2026న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.  లేటెస్ట్ గా రిలీజ్ చేసిన టీజర్ లో ఈ మూవీపై అంచనాలను మరింత పెంచేసింది.

సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్ ..

ఈ సినిమాలో టాలెంటెడ్ బ్యూటీ షార్వారీ వాగ్ కూడా మరో కీలకమైన స్పై రోల్ పోషిస్తోంది. అలాగే వర్సటైల్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా ఇందులో నటిస్తున్నారు. అయితే ఈ ఫస్ట్ గ్లింప్స్‌లో వీరిద్దరినీ దాచిపెట్టి సస్పెన్స్ మెయింటైన్ చేశారు మేకర్స్. హృతిక్ రోషన్ (వార్), షారుఖ్ ఖాన్ (పఠాన్), సల్మాన్ ఖాన్ (టైగర్) లాంటి స్టార్స్ ఈ స్పై యూనివర్స్‌లో క్యామియో అప్పియరెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉందనే టాక్ బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.
 

 

©️ VIL Media Pvt Ltd.