
కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కు పుడక అక్కర్లేని ముక్కు… అలంకరణ అక్కర్లేని అరుదైన నా చికిరి అంటూ బుచ్చిబాబు పెద్ది రిలీజ్‌కు ముందు జాన్వీ కపూర్‌కు ఓ లెవల్లో ఎలివేషన్ ఇచ్చాడు. ఇదే ఊహించుకుని వెళ్లిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసేశాడు డైరెక్టర్. ఆమెను చూపించిన తీరుపై తీవ్రంగా వ్యతిరేకత రావడంతో యూటర్న్ తీసుకున్నాడు. జానూ కూడా ఈ సినిమా ప్రమోషన్స్‌లో ముంబయి నుండి విజయవాడ వరకు జరిగిన ప్రతి ఈవెంట్లో సందడి చేసింది. కానీ ఎప్పుడైతే అచ్చియమ్మ క్యారెక్టర్ నెగిటివిటీ వచ్చిందో భామ సైలెంట్ అయిపోయింది.
పెద్ది సక్సెస్ ఈవెంట్లో కనిపించని జాన్వీ.. ప్రస్తుతం తన తర్వాత స్టోరీలపై ఫోకస్ చేస్తుందట. తుంబడ్ డైరెక్టర్ అనిల్ బార్వే చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతుందట. ఇదొక క్రియేచర్ హారర్ థ్రిల్లర్ స్టోరీ అని టాక్. జియో స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించబోతుందట. ఈ ఏడాది ఇయర్ ఎండింగ్ నుండి మూవీ స్టార్ట్ కాబోతుందని సమాచారం. గతంలో ఘోస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్‌లో మెరిసిన జానూ.. ఈసారి సిల్వర్ స్క్రీన్‌పై హారర్ స్టోరీతో రాబోతుందట. ప్రస్తుతం జానూ చేతిలో లగ్ జా గలేలో నటిస్తోంది. టైగర్ ష్రాఫ్, లక్ష్య హీరోలుగా నటిస్తోన్న ఈ సినిమా నెక్ట్స్ ఇయర్ మే14న రిలీజ్ కాబోతుంది. ఈలెక్కన ఏడాది పాటు జానూ పాప సిల్వర్ స్క్రీన్‌పై కనిపించడం కష్టమే. రాకాలో ఉందన్న టాకే కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు. ఇక పెద్ది రోల్ కారణంగా విమర్శలు ఎదుర్కొన్న జాన్వీ.. దేవర2 ఉంటే తన క్యారెక్టర్ విషయంలో మరింత జాగ్రత్త తీసుకుంటోందా..? దేవరలో పాటలకే పరిమితం చేసిన బ్యూటీని.. ఈసారి ఫెర్ఫామెన్స్ స్కోప్ ఉండేలా మేకర్స్ డిజైన్ చేస్తారా..? లెట్స్ సీ