Reading Time: 2 minutes

ఇక అమ్మాయిలు ధనాధన్.. రేపటి ( జూన్ 12 ) నుంచి విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌..బరిలో 12 జట్లు…టైటిలే లక్ష్యంగా టీమిండియా

Caption of Image.
  • ఫేవరెట్‌‌‌‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌

రెండు నెలలు మెన్స్‌‌ ఐపీఎల్‌‌ను ఎంజాయ్​ చేసిన క్రికెట్‌‌ ఫ్యాన్స్‌‌కు మరో పండుగ వచ్చేసింది. అదిరిపోయే ఆటతో అభిమానులను అలరించడానికి అమ్మాయిలు రెడీ అయ్యారు. ఇంగ్లండ్‌‌ వేదికగా శుక్రవారం నుంచి విమెన్స్‌‌ టీ20 వరల్డ్‌‌ కప్‌‌ జరగబోతున్నది.

లండన్‌‌‌‌: దాదాపు రెండు నెలల పాటు మెన్స్‌‌‌‌ ఐపీఎల్‌‌‌‌ను చూసిన క్రికెట్‌‌‌‌ ఫ్యాన్స్‌‌‌‌కు మరో పండగ వచ్చేసింది. అదిరిపోయే ఆటతో అభిమానులను అలరించడానికి ఈసారి అమ్మాయిలు రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌‌‌‌ వేదికగా శుక్రవారం నుంచి విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ జరగబోతున్నది. విమెన్స్‌‌‌‌ ప్రీమియర్‌‌‌‌ లీగ్‌‌‌‌ (డబ్ల్యూపీఎల్‌‌‌‌), ఇతర దేశాల టీ20 లీగ్‌‌‌‌లతో ఇప్పటికే ఈ ఫార్మాట్‌‌‌‌పై విపరీతమైన ఆసక్తి పెరిగింది. చాలామంది యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ కూడా టీ20ల్లో సంచలనాలు చేస్తున్నారు. కాబట్టి ఈసారి మెగా కప్‌‌‌‌ కోసం పోటీ తీవ్రంగా ఉండనుంది. ఇప్పటి వరకు ఆరుసార్లు చాంపియన్‌‌‌‌ ఆస్ట్రేలియాతో పాటు ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌, డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ న్యూజిలాండ్‌‌‌‌ జట్లలో బలమైన ఆల్‌‌‌‌రౌండర్లకు కొదవలేదు. కాబట్టి ప్రతి మ్యాచ్‌‌‌‌ ఉత్కంఠ రేపడం ఖాయం కనిపిస్తోంది. 

12 జట్లు.. రెండు గ్రూప్‌‌‌‌లుగా

టోర్నీలో ఆడుతున్న 12 జట్లను రెండు గ్రూప్‌‌‌‌లుగా విభజించారు. గ్రూప్‌‌‌‌–1లో ఇండియా, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌, పాకిస్తాన్‌‌‌‌, సౌతాఫ్రికా తలపడనున్నాయి. ఇంగ్లండ్‌‌‌‌, ఐర్లాండ్‌‌‌‌, న్యూజిలాండ్‌‌‌‌, స్కాట్లాండ్‌‌‌‌, శ్రీలంక, వెస్టిండీస్‌‌‌‌ జట్లు గ్రూప్‌‌‌‌–2లో ఉన్నాయి. గ్రూప్‌‌‌‌లోని ప్రతి జట్టు.. మరో టీమ్‌‌‌‌తో తలపడుతుంది. 

ప్రతి గ్రూప్‌‌‌‌లో టాప్‌‌‌‌–2లో నిలిచిన జట్లు సెమీస్‌‌‌‌కు అర్హత సాధిస్తాయి. రౌండ్‌‌‌‌ రాబిన్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌లో 33 మ్యాచ్‌‌‌‌లు జరుగుతాయి. ఆతిథ్య ఇంగ్లండ్‌‌‌‌, శ్రీలంక మధ్య రేపు జరిగే తొలి మ్యాచ్‌‌‌‌తో మెగా టోర్నీకి తెరలేవనుంది. జులై 5న ఫైనల్‌‌‌‌తో టోర్నీ ముగుస్తుంది. 

పాక్‌‌‌‌తో వేట మొదలు..

తొలిసారి వన్డే వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ గెలిచి జోరుమీదున్న ఇండియా టీమ్‌‌‌‌.. షార్ట్‌‌‌‌ ఫార్మాట్‌‌‌‌ కప్‌‌‌‌పై కూడా కన్నేసింది. ఈ నెల 14న బర్మింగ్‌‌‌‌హామ్‌‌‌‌లో పాకిస్తాన్‌‌‌‌తో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌తో టీమిండియా వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ వేట షురూ చేయనుంది. ఒకవేళ హర్మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సేన ఈ టైటిల్‌‌‌‌ గెలిస్తే ఏక కాలంలో వన్డే, టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నెగ్గిన రెండో జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియా మాత్రమే ఈ ఘనత సాధించింది. 

17న నెదర్లాండ్స్‌‌‌‌తో, 21న సౌతాఫ్రికాతో, 25న బంగ్లాదేశ్‌‌‌‌తో, 28న ఆస్ట్రేలియాతో ఇండియా మ్యాచ్‌‌‌‌లు ఆడనుంది. ఇప్పటివరకు ఇండియా ఈ టోర్నీలో 9సార్లు బరిలోకి దిగితే 2020లో రన్నరప్‌‌‌‌తో సరిపెట్టుకుంది. మరో నాలుగుసార్లు సెమీస్‌‌‌‌తోనే సరిపెట్టుకుంది. 2012, 2014, 2016, 2024లో తొలి రౌండ్‌‌‌‌లోనే వెనుదిరిగింది. ఇప్పటివరకు 40 మ్యాచ్‌‌‌‌లు ఆడితే 22 విజయాలు, 18 ఓటములతో 55 శాతం విన్‌‌‌‌ లాస్‌‌‌‌ రికార్డును నమోదు చేసింది. మరి ఈసారైనా కప్‌‌‌‌ నెగ్గి చరిత్ర సృష్టిస్తుందా? లేదా? అనేది చూడాలి. 

ఆసీస్‌‌‌‌ దే హవా..

విమెన్స్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో ఇప్పటివరకు ఆస్ట్రేలియాదే హవా కొనసాగింది. 9సార్లు బరిలోకి దిగితే ఆరుసార్లు చాంపియన్‌‌‌‌ (2010, 2012, 2014, 2018, 2020, 2023)గా నిలిచింది. ఒకసారి రన్నరప్‌‌‌‌, రెండుసార్లు సెమీస్‌‌‌‌ వరకు వెళ్లింది. ఈసారి కూడా కంగారూలు టైటిల్‌‌‌‌ వేటలో హాట్‌‌‌‌ ఫేవరెట్‌‌‌‌గా కనిపిస్తున్నారు. ఆ తర్వాత వెస్టిండీస్‌‌‌‌ (2016), ఇంగ్లండ్‌‌‌‌ (2009), న్యూజిలాండ్‌‌‌‌ (2024) ఒక్కోసారి చాంపియన్‌‌‌‌గా అవతరించాయి. 

సౌతాఫ్రికా (2023, 2024) రెండుసార్లు రన్నరప్‌‌‌‌గా నిలిచింది. శ్రీలంక, పాకిస్తాన్‌‌‌‌, బంగ్లాదేశ్‌‌‌‌, ఐర్లాండ్‌‌‌‌ తొలి రౌండ్‌‌‌‌ను దాటలేకపోయాయి. కాబట్టి ఇండియా, ఇంగ్లండ్‌‌‌‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌ మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. కానీ ఒక్క బాల్‌‌‌‌లో ఫలితం తారుమారు అయ్యే అవకాశం ఉన్న టీ20ల్లో విజేతలను ఊహించడం చాలా కష్టం.  

©️ VIL Media Pvt Ltd.