Reading Time: 2 minutes

జనానికి బ్యాడ్ న్యూస్ : ధరలు భారీగా పెరిగాయి.. రిటైల్ ద్రవ్యోల్బణమే చెబుతోంది..!

Caption of Image.

దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగిందని.. మే నెలలో అది 3.93 శాతంగా ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అంటే మే నెలలో ధరలు భారీగా పెరిగాయని స్పష్టం చేస్తుంది ఈ డేటా. ఆహార పదార్థాలు, నిత్యావసరాల ధరలు పెరగటం వల్ల ద్రవ్యోల్బణం పెరిగినట్లు స్పష్టం చేసింది. 4 శాతం అంచనా వేయగా.. అది 3.93శాతంగానే ఉన్నట్లు చెబుతోంది ఆర్టీఐ. 

మే నెలలో ఆహార, నిత్యావసరాల ధరలు పెరగటానికి కారణం లేకపోలేదు. మే నెలలో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గ్యాస్ ధర ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగింది. దీని ప్రభావం ధరలపై పడినట్లు స్పష్టం చేసింది ఆర్బీఐ. 

మే నెలలో ధరలు పెరిగిన వాటిలో టమాటా, అల్లం, ఎండు ద్రాక్ష (కిస్మిస్), పాలు, కూరగాయలు, పండ్లు,  అంజీరాతోపాటు లోహ ఆభరణాలు ఉన్నాయి. 

మే నెలలో తగ్గిన ధరల లిస్ట్ చూస్తే బంగాళాదుంపలు, బఠానీ, జీల కర్ర, మోటార్ సైకిల్స్, స్కూటర్లు వంటివి ఉన్నాయి. 

►ALSO READ | జూలైలో భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు : ఈ ఏడాదిలో ఇది రెండోసారి
 
ఇప్పటికే పెరిగిన ముడి సరుకుల ధరలతోపాటు మే నెలలో పెట్రోల్ ధర 7.4 శాతం, డీజిల్ 8.4 శాతం ధరలు పెరగటం వల్ల.. రిటైల్ మార్కెట్ లో ఆహార, నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయని స్పష్టం చేస్తుంది ఆర్బీఐ. 

2026 ఏప్రిల్ నెలతో పోల్చితే.. మే నెలలో ధరలు పెరగటం మధ్య తరగతి, పేద కుటుంబాలపై అధిక భారం పడింది. పొదుపు చేసిన డబ్బులు పెరిగిన ధరలకే సరిపోతుంది అనేది వారి ఆవేదన. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు పాల ధరలు, కిరాణా షాపుల్లో నిత్యావసరాల ధరలు పెరగటంతో పొదుపు చేసే సొమ్ము తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సామాన్యులు. బియ్యం, ఉప్పు, పప్పులు, వంట నూనెల ధరలు మరింత పెరగటం అనేది సామాన్యుడికి భారంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారమే ఆహార, నిత్యావసరాల ధరలు పెరిగాయని చెప్పటం చూస్తుంటే.. గ్రౌండ్ రియాల్టీలో పెరిగిన ధరలు కుటుంబాలపై ఎంత భారం పడుతున్నాయో అర్థం అవుతుంది. 

©️ VIL Media Pvt Ltd.