
England Cricket Alcohol Ban: ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌లో రాత్రికి రాత్రే ఒక మైండ్ బ్లాక్ అయ్యే సీన్ చోటు చేసుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ టెస్ట్‌లో ఘన విజయం సాధించిన జోష్‌లో.. ఇంగ్లాండ్ ప్లేయర్లు రూల్స్ బ్రేక్ చేసి నైట్‌క్లబ్ కెళ్లడం, అక్కడ లొల్లి జరగడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ దెబ్బకు కెప్టెన్ బెన్ స్టోక్స్‌తో పాటు గస్ అట్కిన్సన్‌ను కూడా టీమ్ నుంచి పక్కన పెట్టేశారు. అంతేకాదు, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇప్పుడు ప్లేయర్లపై కంప్లీట్ ఆల్కహాల్ బ్యాన్ (మద్యపాన నిషేధం) విధించే రేంజ్‌లో సీరియస్ యాక్షన్ ప్లాన్ చేస్తోంది.
క్లబ్ బయట రచ్చ.. జట్టుపై ఎఫెక్ట్!
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇంగ్లాండ్ బోర్డు పెట్టిన మిడ్‌నైట్ కర్ఫ్యూ రూల్‌ను బెన్ స్టోక్స్, గస్ అట్కిన్సన్ లైట్ తీసుకున్నారు. టైమ్ దాటినా బయటే తిరుగుతూ లండన్‌లోని ఒక నైట్‌క్లబ్‌లో ఎంజాయ్ చేశారు. అయితే తెల్లవారుజామున క్లబ్ బయట ఒక రగ్బీ ప్లేయర్‌తో వీళ్లకు గొడవ జరిగింది. ఆ లొల్లిలో రగ్బీ ప్లేయర్ కొట్టబోతే.. అది కాస్తా ఇంగ్లాండ్ టీమ్ సెక్యూరిటీ గార్డ్‌కు తగిలి కుట్లు పడ్డాయి. ఈ ఇష్యూ బయటకు రావడంతో ఇంగ్లాండ్ క్రికెట్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా మండిపడింది.
ALSO READ : కోహ్లీ-రోహిత్‌కు ఇదే చివరి ప్రపంచకప్?
నో మందు.. నో పార్టీ:
ఈ ఘటన తర్వాత ఇంగ్లాండ్ టీమ్ మెన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోబ్ కీ గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ప్లేయర్లను నమ్మడం వేస్ట్, ఇకపై మ్యాచ్ గెలిచినా సరే.. ఏ టైమ్‌లోనూ, ఏ ప్లేయర్ కూడా ఆల్కహాల్ ముట్టకుండా 100 శాతం బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నట్లు చెప్పాడు. రాత్రి పూట ఇంగ్లాండ్ క్రికెటర్లు మందు తాగి గొడవల్లో కనిపించడం అస్సలు బాలేదు.. ప్రజల్లో మన ఇమేజ్ ఖరాబ్ అవుతోంది.. రూల్స్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తామని రోబ్ కీ తేల్చి చెప్పాడు.
నైట్‌క్లబ్ లొల్లితో కెప్టెన్సీ ఊడింది:
ఈ నైట్‌క్లబ్ లొల్లి వల్ల కెప్టెన్ బెన్ స్టోక్స్, అట్కిన్సన్ ఇద్దరినీ వచ్చే వారం ‘ది కియా ఓవల్’లో జరగబోయే సెకండ్ టెస్ట్ మ్యాచ్ నుంచి సస్పెండ్ చేశారు. స్టోక్స్ ప్లేస్‌లో ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ (Joe Root) మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్నాడు. మరి అసలు విచారణ పూర్తయ్యాక బెన్ స్టోక్స్ మళ్లీ ఇంగ్లాండ్ టీమ్‌కు కెప్టెన్ అవుతాడా లేదా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. మేనేజ్‌మెంట్ మాత్రం ఈ విషయంలో తొందరపడకుండా నిదానంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.
Rob Key on…
Sunday evening
The breach of curfew
Ben Stokes & Gus Atkinson
Root appointed interim captainWatch the full interview with our MD of England Men’s Cricket here 👇 pic.twitter.com/eHAX58aQ8B
— England Cricket (@englandcricket) June 11, 2026