Reading Time: 2 minutes

బెడ్‌రూమ్‌లో శవమై కనిపించిన సూపర్ స్టార్.. చైనీస్ జిన్ జే మరణం వెనుక మిస్టరీ ఏంటి?

Caption of Image.

చైనా చిత్ర పరిశ్రమలో పెను విషాదం నెలకొంది. కేవలం 33 ఏళ్ల వయసులోనే హ్యాండ్‌సమ్ చైనీస్ యాక్టర్, సూపర్ స్టార్ జిన్ జే (Jin Ze) అలియాస్ జంగ్ జియావీ కన్నుమూశారు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో, అదీ ఊహించని రీతిలో ఆయన మరణించడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. జూన్ 4, 2026న హాంగ్‌జౌలోని ఆయన నివాసంలో జిన్ జే శవమై కనిపించినట్లు జూన్ 6న ఆయన టాలెంట్ ఏజెన్సీ ‘షెంగ్‌షి గ్వాంగ్నియన్ కల్చర్’ అధికారికంగా ప్రకటించింది.

మరణం వెనుక మిస్టరీ?
జిన్ జే మరణవార్త చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘వైబో’ (Weibo) లో టాప్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే, ఈ మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? అనే అనుమానాలు ఇప్పుడు నెటిజన్లను వేధిస్తున్నాయి. ఎందుకంటే, ఆయన ఎలా చనిపోయారనే కాజ్ ఆఫ్ డెత్ (Cause of Death) ను ఏజెన్సీ కానీ, కుటుంబ సభ్యులు కానీ వెల్లడించలేదు.  సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ అనేక సందేహాలు లేవనెత్తుతున్నారు. జూన్ 4న హెంగ్ డియాన్ లో చిత్రీకరణ ముగించుకుని ఇంటికి తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత మరణించారు. అయితే దీనిపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. 

మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. చనిపోవడానికి సరిగ్గా నెల రోజుల ముందు, అంటే మే 6న, తాను లీడ్ రోల్ ప్లే చేసిన ఒక క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ పూర్తయిందంటూ జిన్ జే ఎంతో సంతోషంగా వైబోలో పోస్ట్ పెట్టారు. అంత యాక్టివ్‌గా ఉన్న 33 ఏళ్ల యువ హీరో, నెలకు తిరక్కుండానే హఠాత్తుగా బెడ్‌రూమ్‌లో శవమై తేలడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? లేక డిప్రెషన్ కారణమా?, హెల్త్ సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే చర్చ నడుస్తోంది. దీనికి తోడు.. ఎలాంటి పుకార్లను నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు అని ఏజెన్సీ గ్లోబల్ టైమ్స్ ద్వారా విజ్ఞప్తి చేయడం ఈ మిస్టరీని మరింత పెంచింది.

►ALSO READ | రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ . . ఆ రోజే ‘బిగ్ అనౌన్స్‌మెంట్’ అంటూ పోస్ట్!

మోడల్‌ టు షార్ట్ డ్రామా కింగ్!

1993, జనవరి 30న షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లో జన్మించిన జిన్ జే, బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. మొదట మోడల్‌గా రికార్డులు సృష్టించిన ఈ కటౌట్, ఆ తర్వాత నటుడిగా మారి బ్యాక్-టు-బ్యాక్ హిట్లతో దూసుకుపోయారు. హెల్లో జోవాన్, ఫర్గాట్ యు రిమెంబర్ లవ్, బిగిన్ అగైన్, లీగల్లీ రొమాన్స్, బ్యూటీ రీబోర్న్, డోంట్ నెగోషియేట్ విత్ యువర్ బాస్ వంటి రొమాంటిక్ సిరీస్‌లతో చైనాలో లేడీ ఫాలోయింగ్‌ను విపరీతంగా సంపాదించుకున్నారు.

క్రేజీ క్రేజ్

ప్రస్తుతం చైనాలో ఊపందుకుంటున్న షార్ట్-ఫార్మ్ వర్టికల్ డిజిటల్ డ్రామాల్లో జిన్ జే తిరుగులేని కింగ్‌గా ఎదుగుతున్నారు. ఆయన నటించిన అప్‌కమింగ్ డ్రామా “వెయిటింగ్ ఫర్ ది ఫ్లవర్స్ టు బ్లూమ్, వెయిటింగ్ ఫర్ యువర్ రిటర్న్ ” రిలీజ్ కాకముందే ఏకంగా 14.8 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ అడ్వాన్స్ రిజర్వేషన్లు చేసుకున్నారంటే ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి గోల్డెన్ ఫ్యూచర్ ఉన్న యంగ్ స్టార్, తన కొత్త ప్రాజెక్టులు థియేటర్లలోకి రాకముందే.. అనంత లోకాలకు వెళ్లిపోవడం చైనా ఇండస్ట్రీకి కోలుకోలేని దెబ్బ. ఈ మిస్టరీ డెత్‌పై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు సమాచారం…

 

©️ VIL Media Pvt Ltd.