ఉదయం టిఫిన్ కోసం చూసేవాళ్ళు ఇది తింటే శరీరంలో వేడి మొత్తం తగ్గుతుంది. ఇంకా వీటిని టమాటా సాస్ ను కానీ, అల్లం చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకొందరు వీటిని చికెన్ పులుసుతో కూడా తింటారు. మరి అంత టేస్టీగా ఉంటాయి. మరి, ఇంకెందుకు లేట్ కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..
ఒక కప్పు గోదుమపిండి, 2 ఉల్లిపాయలతో చేసే హెల్ది టిఫిన్ కు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు గోదుమపిండి, రెండు ఉల్లిపాయలు,
నాలుగు పచ్చిమిర్చి , కొద్దిగా కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు , కొద్దిగా నీరు –
వీటిని కాల్చడానికి సరిపడా నూనెను తీసుకోవాలి.
హెల్ది టిఫిన్ తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో కొద్దిగా గోదుమపిండి తీసుకుని దానిలో ఉప్పు, జీలకర్రను కూడా బాగా కలపాలి.
ఇంకా దీనిలో ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, కొత్తిమీరను కూడా వేయాలి. ఇంకా పెరుగును కూడా వేసి కొద్దికొద్దిగా నీరు పోస్తూ పిండి మాదిరి దీనిని కలుపుకోవాలి. ఇది కలిపిన తరవాత ఈ పిండిని 10 నిమిషాల పాటు పక్కన ఉంచాలి.
ఇంకా పెనం తీసుకుని దానిలో ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక ఒక గరిటె పిండిని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని
దీనిలో వేసుకోవాలి ఇంకా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇంకా దీనిని వేడి వేడి కొబ్బరి చట్నీ,
అల్లం చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది. మీరు కూడా ట్రై చేయండి.
ఈ టిఫిన్ తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు : గోదుమపిండిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా దీనిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే, ఉల్లిపాయలు మనకి అవసరమైన యాంటీ ఆక్సిడెంట్లను శరీరానికి అందిస్తాయి. వీటిని తింటే ఎక్కువసేపు ఆకలి వేయనివ్వదు. పిల్లల నుంచి ఉద్యోగుల వరకు మంచి టిఫిన్.




