Reading Time: 2 minutes

స్టాక్ మార్కెట్ పండగ చేసుకుంది : రూ.7 లక్షల కోట్ల లాభాలకి కారణాలు ఇవే.. !

Caption of Image.

ఇండియన్ స్టాక్ మార్కెట్ పండగ చేసుకుంది. చాలా రోజుల తర్వాత భారీ లాభాలతో ముగిసింది. వీకెండ్ శుక్రవారం రోజంతా మార్కెట్ అంతకంతకూ పెరుగుతూ ఇన్వెస్టర్లను హ్యాపీ చేసింది. ఓవరాల్ 2 శాతం పెరుగుదలతో 7 లక్షల కోట్ల సంపద క్రియేట్ అయ్యింది. సెన్సెక్స్ 16 వందల 95 పాయింట్లు, నిఫ్టీ 461 పాయింట్లు లాభాల్లో ముగిసింది. 2026, జూన్ 12వ తేదీ మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 75 వేల 527 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 23 వేల 622 దగ్గర క్లోజ్ అయ్యింది. అన్ని స్టాక్స్ లోనూ కొనుగోళ్లు జరిగాయి. సెన్సెక్స్ లో 30 స్టాక్స్ లాభాల్లో ట్రేడ్ అవ్వగా.. టాటా స్టీల్, ఇండిగో, ఎల్ అండ్ టీ, ఎటర్నల్, ఎస్ బీఐ, టెక్ మహీంద్రా షేర్లు 3 శాతం వరకు పెరిగాయి. స్మాల్ క్యాప్ షేర్లు 2 శాతం వరకు లాభపడ్డాయి. స్టాక్ మార్కెట్ భారీ లాభాలు కారణాలు ఏంటీ అనేది చూస్తే..

అమెరికా.. ఇరాన్ ఒప్పందం :

ఇరాన్ దేశంపై దాడులు తీవ్రం చేస్తామని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. ఇరాన్ దేశంతో శాంతి చర్చలకే ప్రాధాన్యం ఇస్తూ.. డీల్ ముగుస్తుందని ప్రకటించారు ట్రంప్. యుద్ధం దాదాపు ముగిసినట్లే అని.. దౌత్యమార్గంలోనే యుద్ధానికి ముగింపు ఉంటుందని అమెరికా ప్రకటించటంతో.. పెట్టుబడి దారుల్లో ఉత్సాహం కనిపించింది. 

తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు :

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి. బ్యారల్ ధర 90 డాలర్లకు పడిపోయింది. ఇరాన్ యుద్దం కొలిక్కి వస్తుందనే ఆశాభావంతో బ్రెంట్, డబ్ల్యూటీఐ క్రూడ్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 4 శాతం పడిపోయింది. 

►ALSO READ | భూ మండలంపై ధనవంతుడిగా ఎలన్ మస్క్ : చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ IPO

ఇండియన్ రూపాయి బలపడింది :

అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గటంతోపాటు భారతీయ రూపాయి విలువ బలపడింది. డాలర్ తో రూపాయి మారకం విలువ 60 పైసలు బలపడి.. 95 రూపాయల 25 పైసలకు చేరింది.

యుద్ధం ఉద్రిక్తతలు తగ్గటం, ముడి చమురు ధరలు దిగిరావటం, రూపాయి విలువ బలపడటం వంటి కారణాలతో మన స్టాక్ మార్కెట్ పండగ చేసుకుంది. ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీటికితోడు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు సైతం లాభాల్లో ట్రేడ్ కావటంతో.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బాగా కలిసి వచ్చింది. 

©️ VIL Media Pvt Ltd.