Reading Time: 2 minutes

ఎంత పని చేశావ్ నాన్న.. పిల్లలకు కడుపు నిండా బిర్యానీ పెట్టి.. ఆ తర్వాత నీళ్లల్లో ముంచి.. 

Caption of Image.

తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన మానవత్వం ఉన్న మనుషులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. కడుపున పుట్టిన ఇద్దరు పిల్లలను చంపి.. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్న నాన్న ఇన్సిడెంట్ అందరినీ కలిచి వేస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన 32 ఏళ్ల కృష్ణ. ఇతనికి సవిత అనే యువతితో పదేళ్ల క్రితం పెళ్లయ్యింది. వీళ్లకు 8 ఏళ్ల రక్షిత్ అనే కుమారుడు.. 5 ఏళ్ల అనన్య అనే కూతురు ఉన్నారు. కొన్నాళ్లుగా భార్య సవితతో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే కృష్ణ చనిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. తాను చనిపోతే పిల్లలు అనాథ అవుతారనే ఉద్దేశంతో పిల్లలను చంపి.. తాను చనిపోవాలని నిర్ణయించుకున్నాడు. 

సంగారెడ్డి నుంచి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ దగ్గరకు వచ్చాడు. తన బైక్ పై తన ఇద్దరు పిల్లలను తీసుకొచ్చాడు. బ్యాక్ వాటర్ దగ్గరకు వస్తూనే తన వెంట బిర్యానీ, వాటర్ బాటిళ్లు తీసుకొచ్చాడు. ప్రాజెక్ట్ సమీపంలో చెట్ల కింద పిల్లలు ఇద్దరికీ కడుపు నిండా బిర్యానీ పెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపు నీళ్లల్లో పిల్లలతో కలిసి ఆడుకున్నాడు. అదే వారి చివరి భోజనం అని.. అదే వారి చివరి ఆట అని ఆ పిల్లలకు తెలియదు. 

పిల్లలతో కలిసి కొద్దిసేపు నీళ్లల్లో ఆడిన కృష్ణ.. వాళ్లతో కలిసి సెల్ఫీ ఫొటోలు తీసుకున్నాడు. పిల్లలతో కలిసి నీళ్లల్లో ఆడుతూ.. ఆ నీళ్లల్లోనే వాళ్లను ముంచి చంపేశాడు. ఆ తర్వాత తాను నీళ్లల్లో మునిగి చనిపోయాడు. 

బయటకు వెళ్లిన పిల్లలకు ఇంటికి తిరిగి రాకపోవటం.. నిజాంసాగర్ బ్యాక్ వాటర్ దగ్గర పిల్లలతో కలిసి దిగిన ఫొటోలు బంధువులకు పంపించటంతో.. అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు బంధువులు. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో గాలింపు చేపట్టిన రెస్క్యూ టీంకు తండ్రి కృష్ణ, పిల్లలు రక్షిత్, అనన్య డెడ్ బాడీలు దొరికాయి. 

భార్య సవితతో గొడవలే ఆత్మహత్యకు కారణం అని బంధువులు చెప్పిన సమాచారంతో ప్రాథమిక నిర్థారణకు వచ్చారు పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు పోలీసులు. బంధువుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం ఉద్విగ్నంగా మారింది.
 

©️ VIL Media Pvt Ltd.