
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా తమిళ సినిమా గమనాన్నే మార్చేసిన దర్శకుడు, నటుడు భారతీరాజా (83) అనారోగ్యంతో జూన్ 10న తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త సినీ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన స్వగ్రామమైన తేని (తమిళనాడు) లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.
ప్రధాని మోదీ సంతాపం..
భారతీరాజా మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలిపారు. భారతీరాజా గారి మరణం తీరని లోటు అని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. తమిళ సినిమా రూపురేఖలను మార్చిన ఘనత ఆయనది. ముఖ్యంగా గ్రామీణ జీవనాన్ని, పల్లెటూరి వాతావరణాన్ని వెండితెరపై ఆయన ఆవిష్కరించిన తీరు అద్భుతం అని కొనియాడారు.. ఈ కష్టసమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఓం శాంతి అంటూ ప్రధాని నివాళులర్పించారు.
திரு பாரதிராஜா அவர்களின் மறைவு பெரும் துயரத்தைத் தருகிறது. தமிழ்த் திரையுலகை மாற்றியமைத்த படைப்புகளை வழங்கிய அவர், திரைப்படத்துறையில் உச்சத்தைத் தொட்ட ஓர் ஆளுமையாகத் திகழ்ந்தார். குறிப்பாக, கிராமப்புற வாழ்க்கையை அவர் சித்தரித்த விதம் மிகவும் போற்றத்தக்கது. துயரமான இந்த வேளையில்,…
— Narendra Modi (@narendramodi) June 11, 2026
మరోవైపు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్ సైతం భారతీరాజాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఒక అసాధారణ దర్శకుడని, ఎంతోమందికి మార్గదర్శకుడని కొనియాడారు. ఆయన సినిమాలు భారతీయ సినిమా చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Tamil Actor Vadivelu pays tributes to Bharathiraja in Theni. pic.twitter.com/Qb1sg6kfiF
— News Arena India (@NewsArenaIndia) June 11, 2026
Deeply saddened by the loss of Bharathiraja sir. An extraordinary filmmaker, a pioneer, and a storyteller whose legacy will forever remain a part of Indian cinema. My heartfelt condolences to his family and loved ones. May his soul rest in peace 🙏 pic.twitter.com/XJ1X0Qvnk8
— Venkatesh Daggubati (@VenkyMama) June 11, 2026
‘పల్లెటూరి కథల’ రారాజు.
1977లో వచ్చిన ఐకానిక్ క్లాసిక్ హిట్ ’16 వయతినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) సినిమాతో దర్శకుడిగా ప్రస్థానాన్ని ప్రారంభించిన భారతీరాజా.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు సాగిన సినీ ప్రస్థానంలో 40కి పైగా అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. నాలుగు గోడల మధ్య, స్టూడియో సెట్లలో షూటింగులు జరిగే రోజుల్లో.. కెమెరాను పల్లెటూరి పొలాల్లోకి, వీధుల్లోకి తీసుకెళ్లి సినిమాను సహజత్వానికి దగ్గర చేసిన విప్లవాత్మక దర్శకుడు ఆయన.
తెలుగులో ఆయన డైరెక్ట్ చేసిన ‘సీతకోకచిలుక’ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కింది. కేవలం దర్శకత్వమే కాకుండా, కెరీర్ చివరి దశలో నటుడిగానూ ఆయన మెప్పించారు. ముఖ్యంగా ధనుష్ హీరోగా వచ్చిన ‘తిరుచిత్రాంబలం’ (తెలుగులో ‘తిరు’) సినిమాలో తాతగా ఆయన చేసిన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
అంత్యక్రియలు
భారత ప్రభుత్వం ఆయనను ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డుతో గౌరవించింది. తమిళ చిత్రసీమకు ఆయన చేసిన అపారమైన సేవలకు గుర్తింపుగా.. భారతీరాజా అంత్యక్రియలను ఆయన స్వగ్రామమైన తేని (తమిళనాడు) లో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయన మరణంతో యావత్ సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.