Reading Time: < 1 minute

అది ఎదురుదెబ్బకాదు.. సుప్రీంకోర్టు తీర్పుపై మీనాక్షీ నటరాజన్

Caption of Image.

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ పిటిషన్ ను సుప్రీంకోర్టు తోసిపుచ్చడంపై కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్ స్పందించారు. రాజ్యాంగాన్ని,  కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం.. అయితే  నామినేషన్ తిరస్కరణ్ తో ఎన్నికల సంఘం  రాజీపడిందని స్పష్టంగా అందరికి తెలిసిపోయింది.. దేశంలో ప్రజాస్వామ్యం  ఎలా ఉందో, ఏం జరుగుతుందోఅందరికీ బహిరంగంగా తెలిపిపోయిందన్నారు మీనాక్షీ నటరాజన్.

రాజ్యసభ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ  కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షీ నటరాజన్  వేసిన పిటిషన్ ను (శుక్రవారం జూన్ 12) సుప్రీకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఒకసారి రిటర్నింగ్ అధికారి అభ్యర్థి  నామినేషన్ ను తిరస్కరిస్తే ఎన్నికల సంఘాన్ని  ఆశ్రయిం చడమే ఏకైక పరిష్కారం అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది.  ఎన్నికల సంఘం నిర్ణయం ఎంత తప్పుగా ఉన్నప్పటికీ  ఒకసారి నామినేషన్ తిరస్కరించిన తర్వాత దానికి సాధారణంగా వేరే పరిష్కారం ఉంటుంది.. ఆ దశలో కోర్టు జోక్యం చేసుకోదని వెల్లడించింది. 

►ALSO READ | ఆ కేసు మా పరిధిలోకి రాదు.. ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లాలి.. మీనాక్షి నటరాజన్ కు నాంపల్లి కోర్టు సూచన

అయితే కోర్టు తీర్పు తర్వాత మీనాక్షీ నటరాజన్ ధైర్యంగానే ఉన్నారు. నిరాశ లేదు,..ఆశ్చర్యం అంతకన్నా లేదు..  దేశంలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో అందరికీ బహిరంగంగా తెలిసిపోయింది. రాజ్యాంగాన్ని , కోర్టు తీర్పును గౌరవిస్తాం.. సుప్రీకోర్టు తీర్పుపై  వ్యాఖ్యానించను.. కానీ ఎన్నికల సంఘం  రాజీపడిందని స్పష్టం తెలుస్తోందని మీనాక్షీ నటరాజన్ అన్నారు. 

©️ VIL Media Pvt Ltd.