
మామిడి రైతులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే మన మామిడి పండ్లను జపాన్ బ్యాన్ చేసిన క్రమంలో.. నేపాల్ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడం షాకింగ్ గురిచేస్తోంది. నేపాల్ లోని బాలెన్ షా ప్రభుత్వం.. భారత్ నుంచి వస్తున్న మామిడి పండ్ల దిగుమతిపై నిషేధం విస్తూ నిర్ణయం తీసుకోవడం మామిడి రైతులను ఆందోళనలో పడేసింది.
నేపాల్ బార్డర్ లోని క్వారంటైన్ ఇన్స్స్పెక్టర్లు ఇండియా నుంచి వస్తున్న మామిడి పండ్లలో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్లు గుర్తించడంతో.. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నేపాల్ వ్యవసాయ మంత్రిత్వ శాఖఆదేశాల మేరకు ఏప్రిల్-మే నుంచి ఈ ఆంక్షలు కొనసాగుతున్నాయి. అయితే లేటెస్టుగా దిగుమతిని పూర్తిగా బ్యాన్ చేయడం గమనార్హం. మామిడి దిగుబడి వచ్చి.. పంట పూర్తయ్యే సమయంలో బ్యాన్ చేయడం కాస్త ఆందళన కలిగించే అంశం. నేపాల్ ప్రభుత్వ నిర్ణయంతో ఆల్ఫోన్సో, దసేరీ, చౌసా, కేసరీ, లంగ్రా, బంగినపల్లి మొదలైన ప్రీమియం మామిడి రకాలపై ప్రభావం చూపనుంది.
ఒత్తిడిలో స్థానిక మార్కెట్లు:
నేపాల్ నిర్ణయంపై స్థానిక వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సన్నాహాలు లేకుండా.. దీర్ఘకాలిక వ్యూహ లేకుండా ఆంక్షలు విధించడం వ్యాపారాలకు గురిచేసే అంశం అని పేర్కొన్నారు.
జపాన్ తర్వాత, ఈ సమస్యపై భారత మామిడి పండ్ల దిగుమతిని నేపాల్ నిషేధించింది.ఈ ఏడాది ఆరంభంలో జరిపిన తనిఖీలలో భారతీయ మామిడి శుద్ధి కేంద్రాలలో కీటక నియంత్రణ విధానాలలో లోపాలను తమ క్వారంటైన్ అధికారులు గుర్తించిన తరువాత, నేపాల్ కంటే ముందే, జపాన్ గత నెలలో భారతదేశం నుండి మామిడి దిగుమతులను నిలిపివేసింది.
వేసవిలో మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుండటంతో..భారత నుంచి దిగుమతులు నిలిచిపోవడం మార్కెట్లో కొరతను సృష్టించవచ్చు అని నేపాల్ వ్యాపారి ఒకరు అన్నారు. పూర్తి నిషేధం విధించకుండా, క్వారంటైన్ వ్యవస్థలను బలోపేతం చేసి, సరైన నాణ్యతా పరీక్షల తర్వాతే భారతీయ పండ్లను దేశంలోకి అనుమతించాలని కోరారు. దేశీయ పండ్ల రకాలను ప్రోత్సహించేందుకే నేపాల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు.
జపాన్‌లో నిషేధం,,
ఇప్పటికే ఇండియా మ్యాంగోస్ పై జపాన్ లో నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది తొలినాళ్లలో జరిపిన తనిఖీలలో, ఇండియాలోని మామిడి పండ్ల శుద్ధి కేంద్రాలలో పురుగుల నియంత్రణ పద్ధతులలో లోపాలను జపాన్ క్వారంటైన్ అధికారులు గుర్తించినట్లు పేర్కొన్నారు. దీంతో మే నెలలో జపాన్ మన మిడి దిగుమతులను నిలిపివేసింది. ఇటువంటి నిషేధం విధించడం 20 ఏండ్లలో ఇదే మొదటిసారి.
ఇండియాలో ప్రతి ఏటా దాదాపు 28 మిలియన్ మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఉత్పత్తి అవుతుంటాయి. మామిడి ఎగుమతులలో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా నిలిచింది. మన దగ్గర పండుతున్న మామిడి దాదాపు దేశవాళీ వినియోగానికే ఉపయోగకపడుతున్నప్పటికీ .. జపాన్ వంటి మార్కెట్లకు చేసే ఎగుమతులు రైతులు, వ్యాపారులకు మంచి లాభాలను తెచ్చిపెడతాయి.