Reading Time: < 1 minute

ఈ రాత్రి ఇరాన్ దేశానికి నరకం చూపిస్తా : ట్రంప్ మాస్ వార్నింగ్

Caption of Image.

ఇరాన్ దేశానికి వెరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ రాత్రికి మా దాడులు ఎలా ఉంటాయో ఇరానీయన్లు చూస్తారు.. అనుభవిస్తారు.. ఈ రాత్రికి ఇరాన్ దేశం నరకం చూస్తుంది అంటూ హెచ్చరించారు. రెండు రోజులుగా జరుగుతున్న ప్రతీకార దాడులతో మళ్లీ భీకర యుద్ధం దిశగా వెళుతుంది. కువైట్, ఒమెన్, ఇరాక్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడుల తర్వాత.. ట్రంప్ ఈ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు కలకలం రేపుతోంది.

ట్రంప్ మునుపెన్నడూ లేనంతగా ఇరాన్ కు స్ట్రాంగ్ మేసేజ్ పంపారు.  ఈ రోజు(గురువారం, జూన్11)  రాత్రికే  ఇరాన్ ప్రధాన చమురు కేంద్రమైన ఖార్గ్ ద్వీపాన్ని,  ఇతర విద్యుత్ ప్లాంట్లను అమెరికా స్వాధీనం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్ తో మిడిల్  ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అయ్యాయి.  

‘‘అమెరికా ఈ రాత్రి ఇరాన్‌పై చాలా తీవ్రంగా దాడి చేయబోతోంది.. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వైమానిక దళం, రాడార్, యాంటీ మిస్సైల్ వ్యవస్థలతోపాటు అన్ని ఇతర రక్షణ వ్యవస్థలు నాశనమయ్యాయి. త్వరలో మేం ఖార్గ్ ద్వీపాన్ని, చమురు కేంద్రాలను  స్వాధీనం చేసుకుంటాం.. ఇరాన్ చమురు ,గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణను సాధిస్తాం.. వెనిజులా విషయంలో మేం చేసినట్లే ఇది కూడా జరుగుతుంది. ఇది వెనిజులా ,అమెరికా సంయుక్త రాష్ట్రాలు రెండింటికీ అద్భుతంగా కలిసి వస్తోంది. ఈ విషయంపై మీ శ్రద్ధకు ధన్యవాదాలు.’’ అంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ చేశారు. 

►ALSO READ | యుద్ధం మళ్లీ భీకరంగా..

©️ VIL Media Pvt Ltd.