Reading Time: 2 minutes

భారత జట్టు డ్రెస్సింగ్ రూంలో లొల్లి.. గంభీర్‌ను కాదని బీసీసీఐతో సీనియర్ల సీక్రెట్ భేటీ!

Caption of Image.

Gambhir vs Rohit, Kohli: భారత క్రికెట్‌లో ఇప్పుడు ఒక పెద్ద ఇంటర్నల్ వార్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది (2027) సౌత్ ఆఫ్రికా వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు టీమిండియా ప్రిపరేషన్స్ స్టార్ట్ అవుతున్న టైమ్‌లోనే.. టీమ్ మేనేజ్‌మెంట్‌లో పెద్ద ముసలం నెలకొన్నట్లు రిపోర్ట్స్ వస్తున్నాయి. టెస్టులు, టీ20లలో తన మార్క్ చూపిస్తూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతున్న హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir).. వన్డే ఫార్మాట్‌లోకి వచ్చేసరికి ఇంకా ఆ జోన్‌లోకి రాలేకపోతున్నాడనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఫ్యూచర్ ఏంటి అనే సస్పెన్స్ ఈ వివాదాన్ని మరింత పెద్దిది చేసింది. 

కోచ్‌ను సైడ్ చేసి బీసీసీఐ పెద్దలని కలిసిన సీనియర్లు: 
టీమ్‌లోని కొందరు సీనియర్ ప్లేయర్లు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్‌లను పూర్తిగా పక్కనబెట్టేసి, 2027 వన్డే వరల్డ్ కప్‌లో తమ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటనే దానిపై క్లారిటీ కోసం డైరెక్ట్‌గా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) పెద్దలనే కాంటాక్ట్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్. రోహిత్, కోహ్లీలు టీ20ల నుంచి రిటైర్ అయ్యాక, 2027 వన్డే వరల్డ్ కప్‌లో వాళ్లు ఉంటారా లేదా అనే అనుమానాలు పెరిగాయి. గంభీర్ కఠినమైన సెలెక్షన్ పాలసీలు, యంగ్ టీమ్‌ను బిల్డ్ చేయాలనే పట్టుదలే సీనియర్ల రిటైర్మెంట్ ట్రాన్సిషన్‌కు కారణమని చాలా మంది భావిస్తున్నారు.

మళ్లీ నిరూపించుకునే ఓపిక లేదు:- విరాట్ కోహ్లీ
ఇటీవల ముగిసిన ఐపీఎల్ (IPL 2026) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ఆడిన విరాట్ కోహ్లీ ఒక విషయాన్ని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశాడు. ప్రతిసారి ‘తనను తాను నిరూపించుకోవాల్సిన’ జోన్‌లో లేనని హింట్ ఇచ్చాడు.. మరోవైపు రోహిత్ శర్మ వన్డేలలో ఒక డిఫరెంట్ అప్రోచ్‌తో వెళ్తున్నాడు.. టీమిండియాకు ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన ఆ సెల్ఫ్‌లెస్ స్టైల్ నుంచి కొద్దిగా మారినట్లు కనిపిస్తోంది. 

ALSO READS : బాబర్, రిజ్వాన్, ఆఫ్రిదిలకు నో ప్లేస్..

గిల్, గంభీర్ చేతుల్లోనే అసలు గేమ్: 
ప్రస్తుతం వన్డే కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్ (Shubman Gill) డ్రెస్సింగ్ రూమ్‌లో తన వాయిస్‌ను ఇంకా స్ట్రాంగ్‌గా వినిపించాల్సి ఉందట. గంభీర్ కూడా మిగతా రెండు ఫార్మాట్లలో ఇన్వాల్వ్ అయినంత యాక్టివ్‌గా వన్డే ప్లానింగ్స్‌లో ఇంకా ఇన్వాల్వ్ అవ్వలేదని, అంతా దానంతట అదే సాగిపోనిస్తున్నాడని ఒక బీసీసీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ ఇకపై గంభీర్, గిల్ ఇద్దరూ చొరవ తీసుకుని, రాబోయే 16 నెలల వరల్డ్ కప్ రోడ్ మ్యాప్ ఏంటి? సీనియర్ల నుంచి టీమ్ ఏం ఆశిస్తోంది? అనే విషయాలను డ్రెస్సింగ్ రూమ్‌లో మొహమాటం లేకుండా ఫేస్-టు-ఫేస్ మాట్లాడాల్సి ఉంటుంది. 
 

©️ VIL Media Pvt Ltd.