Reading Time: < 1 minute

ఫామ్ 26లో నోటీసుల గురించి ఎక్కడా ప్రస్థావన లేదు: మీనాక్షి నటరాజన్

Caption of Image.

ఎన్నికల అఫిడవిట్‌లో సమాచారం మొత్తం ఇచ్చానని అన్నారు -తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌. తను ఎలాంటి సమాచారం దాచలేదని.. ఎలాంటి క్రిమినల్‌ కేసు కూడా లేదని అన్నారు. నేను నేరపూరిత చర్యలకు పాల్పడలేదని చెప్పారు. అడిగిన సమాచారం ఇచ్చినా నామినేషన్‌ తిరస్కరించారని తెలిపారు. జూన్ 12న ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. తనకు లీగల్ నోటీసు మాత్రమే వచ్చిందని అన్నారు. 

లీగల్ నోటీస్ పైన కోర్టులో విచారణ జరుగుతోందని అన్నారు. ఫామ్ 26లో నోటీసుల గురించి ఎక్కడా ప్రస్థావన లేదన్నారు. కేవలం కేసుల వివరాలు మాత్రమే చెప్పాలని ఫామ్ 26 లో ఉందని గుర్తు చేశారు. ఫామ్ 26 లో అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చానని అన్నారు. కాలమ్ లేనందునే లీగల్ నోటీసుపై వివరాలు ఇవ్వలేద స్పష్టం చేశారు. కేసు విచారణలో ఉందని.. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 
 

©️ VIL Media Pvt Ltd.