ఆర్ధిక ఇబ్బందులు, ఇతర అవసరాల వల్ల క్రెడిట్ కార్డు బిల్లులను కట్టడం చాలామంది ఆలస్యం చేస్తూ ఉంటారు. దీని వల్ల బ్యాంకులు కాల్స్ చేసి త్వరగా కట్టాల్సిందిగా కోరుతూ ఉంటాయి. కట్టకపోతే ఇంటికి వచ్చి అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఇదే కాకుండా బిల్లు కట్టడం ఆలస్యమైతే మీ సిబిల్ స్కోర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. గడువు తేదీలోగా బిల్లు పే చేయలేని సందర్భంగా క్రెడిట్ స్కోర్, బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్ నుంచి చాలామంది ఆందోళన పడుతుంటారు
అయితే డ్యూ డేట్ దాటిన తర్వాత ఒక్క రోజు ఆలస్యంగా కట్టినా సిబిల్ స్కోర్ పడిపోతుందేమోనని చాలామంది ఆందోళన పడిపోతుంటారు. కానీ అందులో నిజం లేదు. ఆర్ధిక నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక్కరోజు లేట్ అయినంత మాత్రాన క్రెడిట్ స్కోర్ తగ్గదు. తక్షణమై మీ సిబిల్ స్కోర్‌పై ఎలాంటి ప్రభావం చూపెట్టదు. అయితే అదే పనిగా ఎక్కవసార్లు ఆలస్యం చేస్తే మాత్రం నష్టం వాటిల్లుతుంది.
మీరు ఎక్కవసార్లు క్రెడిట్ కార్డు బిల్లు డ్యూ డేట్ ముగిసిన తర్వాత రెండు లేదా మూడు రోజుల్లోగా చెలిస్తే మాత్రం స్కోర్ దెబ్బతింటుంది. ఒకటి, రెండుసార్లు అయితే బ్యాంకులు సిబిల్‌కు రిపోర్ట్ చేయవు. అదే పనిగా జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ చేస్తాయి. మీరు రెండు, మూడు రోజులు ఆలస్యం చేసినంత మాత్రాన వెంటనే రిపోర్ట్ చేసే పరిస్థితి ఉండదు.
ఒక చెల్లింపు మీ క్రెడిట్ స్కోర్‌లో కనిపించడానికి ముందు కనీసం 30 రోజుల పాటు బకాయిగా ఉండాలి. దీంతో మీరు రెండు, మూడు రోజులు లేట్ చేసినా క్రెడిట్ స్కోర్ దెబ్బతినదు. దీనికి బదులు మీరు ఆలస్యం రుసుంలు, చెల్లించని మొత్తంపై వడ్డీ వంటివి కట్టాల్సి వస్తుంది. దీని వల్ల మీ క్రెడిట్ కార్డు బిల్లు అనేది పెరుగుతుంది.
30 రోజులపైబడి ఆలస్యం చేస్తే సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీరు రుణాలు పొందలేరు. ఇక పదే పదే ఆలస్యం చేస్తుంటే కాలక్రమేణా మీ సిబిల్ భారీగా తగ్గిపోతుంది. దీని వల్ల భవిష్యత్తులో మీకు ఎలాంటి రుణాలు అసలు అందే పరిస్థితి ఉండదు. అందుకే సకాలంలో బిల్లులు చెల్లించడం చాలా ముఖ్యం.




