Reading Time: 2 minutes

Bharat Bhhagya Viddhaata Review: థియేటర్లలో ఏడిపించేస్తున్న కంగనా రనౌత్.. ‘భారత్ భాగ్య విధాత ‘ మూవీ ఎలా ఉందంటే?

Caption of Image.

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో, మనోజ్ తపడియా దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ (Bharat Bhhagya Viddhaata). భారీ అంచనాల మధ్య ఈ మూవీ జూన్ 12న థియేటర్లలోకి వచ్చింది.  26/11 ముంబై ఉగ్రదాడుల నేపథ్యంలో ఇప్పటివరకు మనం తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్ కథలనే ఎక్కువగా సినిమాల్లో చూశాం. కానీ, ఆ భయానక రాత్రి కామా హాస్పిటల్ (Cama Hospital) లో ఏం జరిగింది? ప్రాణాలకు తెగించి రోగులను కాపాడిన ఆ నర్సుల అసమాన ధైర్యసాహసాల కథేంటి? అనే అన్‌టోల్డ్ స్టోరీని ఈ సినిమా కళ్ళకు కట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి క్రేజ్ సృష్టిస్తోంది? పబ్లిక్ టాక్ ఎలా ఉంది? పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో కంగనా ఏ మేరకు మెప్పించిందో ఇప్పుడు చూద్దాం!

కథాంశం

ఒక సాధారణ నర్సు గీతా మాధవ్ (కంగనా రనౌత్) పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్‌గా, హాస్పిటల్ వాతావరణం, నర్సుల మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్, వారి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లైఫ్స్ చుట్టూ తిరుగుతుంది. గీతా మాధవ్‌కు ఒక కేరింగ్ హస్బెండ్, క్యూట్ కూతురు ఉంటారు.  అంతా ప్రశాంతంగా సాగిపోతుందనుకున్న సమయంలో…  గీత జీవితంలోకి 2008 నవంబర్ 26 రాత్రి ఒక పెను తుఫానులా మారుతుంది. ముంబై నగరంలో కాల్పులు జరుగుతున్నాయనే వార్త వస్తుంది.

కట్ చేస్తే… అజ్మల్ కసబ్ సహా ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులు కామా హాస్పిటల్‌లోకి చొరబడతారు. హాస్పిటల్ కారిడార్లలో తూటాల వర్షం, ఆర్తనాదాలు.. ఆ భయానక చీకటి రాత్రి. అప్పటివరకు ఇంజెక్సన్లు ఇచ్చిన చేతులే… 400 మందికి పైగా రోగుల ప్రాణాలు కాపాడటానికి ఎలా ఎదురుతిరిగాయి? చావు అంచుల్లో నిలబడి ఆ నర్సులు చూపిన తెగింపు ఏంటి? అనేది ఊపిరి బిగబట్టేలా చేస్తుంది.

►ALSO READ | Rukmini Vasanth: ‘డ్రాగన్’ బ్యూటీకి టాలీవుడ్లో మరో ఛాన్స్.. నాని ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా రుక్మిణి?

ప్లస్ పాయింట్స్

కంగనా రనౌత్ ఈ సినిమాలో ఎక్కడా లౌడ్ హీరోయిజం చూపించలేదు. భయం, గుండె నిబ్బరం, కళ్లల్లో కన్నీరు.. ఇలా ఒక సాధారణ నర్స్ ఎలా స్పందిస్తుందో అలాగే జీవించేసింది. ముఖ్యంగా డెత్ బెడ్‌పై ఉన్న పేషెంట్లను చూస్తూ ఆమె ఏడ్చే ఒక ‘బ్రేక్‌డౌన్ సీన్’ సినిమాకే హైలైట్ నిలిచాయి.  గిరిజా ఓక్, స్మితా తాంబే, ఈషా డే, అమృత నామ్‌దేవ్, ప్రియా బెర్డే వంటి నటీనటులు మరాఠీ వాతావరణాన్ని, హాస్పిటల్ లోపలి టెన్షన్‌ను పీక్స్‌కి తీసుకెళ్లారు.  దర్శకుడు మనోజ్ తపారియా ఈ సినిమాను ఎలాంటి అనవసరపు దేశభక్తి డైలాగులు, ఓవర్ మెలోడ్రామా లేకుండా చాలా గ్రౌండెడ్‌గా, గ్రిప్పింగ్‌గా తెరకెక్కించారు. సెకండ్ హాఫ్‌లో వచ్చే ప్రతీ సీన్ ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టేలా చేసింది.

 

ఆడియన్స్ రివ్యూ..

ప్రస్తుతం ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ఆడియన్స్ సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఒక అసలైన కంగనా రనౌత్ సినిమాను థియేటర్లలో చూసిన ఫీలింగ్ కలిగింది అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ అవార్డులు ఇవ్వాలి. ముఖ్యంగా ఆ ఓల్డ్ గార్డ్ సెల్యూట్ సీన్ చూస్తే కన్నీళ్లు ఆగవు అని నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు. లౌడ్ యాక్టింగ్ కాకుండా, కేవలం కళ్లల్లో భయాన్ని, గుండెల్లో ధైర్యాన్ని చూపిస్తూ కంగనా జీవించేసింది. ముఖ్యంగా ఒక బ్రేక్‌డౌన్ సీన్‌లో ఆమె నటన థియేటర్లలో ఉన్నవారిని కదిలించివేస్తుంది.

 

దర్శకుడు మనోజ్ తపడియా ఎక్కడా ఓవర్ డ్రామా లేకుండా, కమర్షియల్ హంగుల కోసం కథను పక్కదారి పట్టించకుండా చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించారు. గిరిజా ఓక్ గొడ్బోలే, స్మితా తాంబే, ఈషా డే, ప్రియా బెర్డే వంటి నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ‘భారత్ భాగ్య విధాత’ కేవలం ఒక సినిమా కాదు.. చరిత్ర మరిచిపోయిన కొందరు రియల్ లైఫ్ లేడీ హీరోల వీరగాథ అని ప్రశంసలు అందుకుంటుంది. దేశభక్తిని కేవలం స్లోగన్స్‌తో కాకుండా, ప్రాణ త్యాగానికి సిద్ధపడిన నర్సుల రూపంలో చూపించిన ఈ ‘భారత్ భాగ్య విధాత’ ప్రతి ఒక్కరూ చూడాల్సిన ఒక ఇన్‌స్పైరింగ్ మాస్టర్‌పీస్ అని కొనియాడుతున్నారు.

 

©️ VIL Media Pvt Ltd.