v అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. ముఖ్యంగా ఆకర్షణీయమైన రూపం, మంచి మాట తీరుతో వీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. చాలా ప్రత్యేకమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. అందరితో చాలా సులభంగా కలిసి పోతారు. అలాగే ఈ వీ అనే అక్షరంతో పేరు మొదలు అయ్యే వారు ఆకర్షణీయమైన శరీరాన్ని కలిగి ఉంటారు.
వీరు చాలా వరకు స్వతంత్ర భావాలు కలిగి ఉంటారు. ఇతరుల కింద పని చేయడానికి ఇష్టపడరు. తమ కష్టంతో పైకి ఎదగాలనే ధృఢ సంకల్పం ఉంటుంది. అలాగే చాలా కళా రంగంపై మంచి పట్టు ఉంటుంది. ఈ రంగంలో ఉన్నతస్థానానికి వెళ్తారు. ఇతరుల చెప్పేవి విన్నా తమకు నచ్చింది మాత్రమే చేసే స్వభావం ఉంటుంది. అలాగే సొంత నిర్ణయాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు.
అందరితో చాలా స్నేహపూర్వకంగా మెదులుతారు. ముఖ్యంగా కుటుంబానికి, స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బంధాలు, బంధుత్వాలకు విలువనివ్వడంలో వీరు ముందుంటారు. ప్రతి ఒక్కరితో చాలా సరదాగా గడపడానికి ఇష్టపడతారు. అంతే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. ఇతరులకు సహాయం చేయడంలో కూడా వీరు మొదటి స్థానంలో ఉంటారు. చాలా ఆనందంగా, సరదా జీవితం గడుపుతారు.
కష్టపడే తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. కావాలి అనుకున్నది సాధించుకునే పట్టుదల, అలాగే మెండితన చాలా ఎక్కువ. అతే కాకుండా ఇది కావాలి అంటే దాని కోసం అహర్నిశలు కష్టపడి పని చేసి దానిని సాధించుకుంటారు. విద్య పరంగా కూడా వీరు చాలా ఉన్నతంగా ఉంటారు. చాలా క్రమశిక్షణగా మెదులుతారు. చిన్న వయసులోనే ఉన్నత స్థానానికి చేరుకుంటారు.
అన్నీ బాగున్నప్పటికీ వీరిలో కొన్ని మైనస్ పాయింట్లు కూడా ఉన్నాయంటున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. ముఖ్యంగా వీరికి కోపం చాలా ఎక్కువ. చాలా విషయాల్లో మొండిగా వ్యవహరిస్తారు. వీరి మనసులో ఏం ఉందో కూడా తెలుసుకోవడం చాలా కష్టం.(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)




